పెద్దేముల్ : మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మకు గ్రామస్తులు మంగళవారం అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించారు. మహిళలు, యువతులు ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు అందరిని ఆకర్శించాయి.