భువనగిరి కోటపై స్థానికులకు అవకాశం..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అభ్యర్థికి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానం కల్పించారు. నియోజకవర్గం ఇప్పటి వరకు నల్లగొండ, తర్వాత భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉండేవి.
- ఇప్పటివరకు ఎన్నికైన వారిలో స్థానికేతరులే అధికం
- తొలిసారి స్థానికుడు మల్లేష్‌కు అవకాశం కల్పించిన కేసీఆర్
- బీసీల్లో కురుమగొల్లకు దక్కిన చాన్స్
ఇబ్రహీంపట్నం, మార్చి 24 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అభ్యర్థికి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానం కల్పించారు. నియోజకవర్గం ఇప్పటి వరకు నల్లగొండ, తర్వాత భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉండేవి. ఈ స్థానం నుంచి ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాకు చెందినవారే ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి ధర్మభిక్షం, సురవరం సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు వంటి నల్లగొండ జిల్లా నేతలే ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరింది.
ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే, బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్యగౌడ్‌లు ప్రాతినిధ్యం వహించారు. కానీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఏ ఒక్క నాయకుడికి అవకాశం లభించలేదు. ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇబ్రహీంపట్నానికి చెందిన బలమైన బీసీ నాయకుడికి చాన్స్ ఇచ్చారు. రాష్ట్రంలోనే గొల్లకురుమలకు చెందిన క్యామ మల్లేష్‌కు తొలిసారిగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానం కల్పించారు. దీంతో బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యామ మల్లేష్ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మల్రెడ్డి రాంరెడ్డి ఉండడంతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవీబాధ్యతలు నిర్వర్తించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గొల్లకురుమలకు సుమారు 52వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గొల్లకుర్మలకే ఓట్లున్నాయి. అలాగే, గౌడ్లకు 48వేలు, ముదిరాజులకు 28వేలు, మునూరుకాపులకు 13వేలు, ఎస్సీలకు 26వేలు, ఎస్టీలకు 27వేల ఓట్లు ఉన్నాయి. దీంతో రాజకీయాలకతీతంగా బీసీ నాయకులు మద్దతు ప్రకటిస్తుండడంతో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తొలిసారి స్థానిక నేతకు చాన్స్..
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు స్థానికేతరులే పోటీ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, భూర నర్సయ్యలు స్థానికేతరులే. ఈ ఎన్నికల్లో క్యామ మల్లేష్ గెలుపొందితే తొలిసారి స్థానికుడవుతారు. భువనగిరి ఎంపీ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. స్థానికుడికి అవకాశం కల్పించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన చతురతను చాటుకున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

