పొగమంచుతో పైలం
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది.
- దట్టంగా కురుస్తున్న మంచుతో జనం ఉక్కిరిబిక్కిరి
- దగ్గరికొచ్చేదాకా కనిపించని వాహనాలు
- రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం
- అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు అవకాశం
- అత్యవసరమైతేనే నైట్ జర్నీ చేయాలని నిపుణుల సూచన
- రానున్న పండుగల ప్రయాణాలూ కష్టాలే..
- ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. ఈ నెలతోపాటు జనవరి మొత్తం దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేరొంటున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో మంచు తగ్గుముఖం పట్టవచ్చని తెలియజేస్తున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం..
పొగ మంచు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై పంజా విసురుతున్నది. శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హృదయ స్పందనల్లో మార్పులు వస్తాయి. పంటలు, పశు పక్షాదులకు సైతం తీవ్ర నష్టానికి గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు చిన్నపాటి గాలి తగిలినా జలుబు, దగ్గు వంటి రుగ్మతలు దరి చేరుతాయి. చిన్నారులు, ఆస్తమా రోగులుకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇంటి నుంచి బయట వెళ్లకుండా చూసుకోవడం మంచిది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
- మంచుతో జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త రోడ్లపై మలుపులు, రహదారుల స్థితిగతులపై అవగాహన ఉండదు.
- మంచు తెరలు తొలిగిపోయాకే ప్రయాణాన్ని కొనసాగించాలి.
- వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను తప్పనిసరిగా అతికించాలి. తకువ వెలుతురులోనూ స్పష్టంగా రంగులు వెదజల్లే స్టికర్లు అంటించాలి.
- వాహనానికి ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవాలి. పసుపు వర్ణంతో వెలిగే ఈ దీపాలు శీతాకాలంలో ఎంతో మంచిది. మంచు తెరల నుంచి కాంతి ప్రసరించి వెలుతురు కనిపిస్తుంది.
- బండి స్పీడ్ లిమిట్లో పెట్టుకోవాలి. ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేయొద్దు.
- రాత్రంతా మంచు కురవడంతో రోడ్లు తడిగా ఉంటాయి. బ్రేకులేసినా వాహనం జారి పడిపోయే అవకాశం ఎకువగా ఉంటుంది.
- వెహికల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
- వాహనాలను రోడ్ల పకకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో లేదా వెలుతురు ఉన్న చోట నిలిపితే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండకపోగా, ప్రమాదాలను నివారించవచ్చు.
- బండి ఆగిపోతే నంబరు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే వాహనాన్ని తొలగించడం, ప్రమాద నివారణకు చర్యలు చేపడతారు.
- అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచుకోవాలి. మోటర్ వెహికిల్స్‌లో జర్నీ చేసేటప్పుడు వైఫర్లు వేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
- ప్రయాణించే వాహనం పూర్తిగా కండిషన్లో ఉండాలి. ఇంజిన్, టైర్లు, ముందు అద్దాలు సరిగ్గా ఉంటేనే నడుపాలి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

