వెంగళరావునగర్, నవంబర్ 27: ఉతకడానికి బట్టలు వేసిన వాషింగ్ మెషిన్ పేలింది. దాని భాగాలు ఇంటి పైకప్పుకు బలంగా తగిలి నేలపై పడటంతో ఫ్లోర్ టైల్స్ పగిలిపోయిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి అమీర్‌పేట్‌లో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట ధరంకరం రోడ్డు కేకే ఎన్‌క్లేవ్‌లోని 503వ నంబరు ఫ్లాట్‌లో సుందర్ రామశాస్త్రి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. బాల్కనీలో ఉన్న వాషింగ్‌మెషిన్‌లో దుస్తులు వేశారు.
కొద్దిసేపటి తర్వాత వాషింగ్ మెషిన్ రన్నింగ్‌లో ఉండగానే పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయింది. హాల్లో కూర్చుని ఉన్న కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు జరగడానికి రెండు నిమిషాల ముందే సుందర్ రామశాస్త్రి కూతురు, మనమడు, మనమరాలు వాషింగ్ మెషిన్ ఉన్న బాల్కనీలో నుంచి ఇంట్లోకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుందర్ రామశాస్త్రి ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.