మరిన్ని కొత్త బడులు
ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లాలో మరో 11 పాఠశాలలు అందుబాటులోకి..
- పంచాయతీకో స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
- క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
- జిల్లాలో మూతబడ్డ 88 బడులనూ పునః ప్రారంభించాలని కోరుతున్న ప్రజలు
రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 11 పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో జిల్లాలో ఇప్పటివరకు మూతబడి ఉన్న 88 పాఠశాలలను కూడా పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను స్థానికులు తెరపైకి తీసుకొస్తున్నారు.
పంచాయతీకో బడి..
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,309 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రైమరీ పాఠశాలలు 880, యూపీఎస్‌లు 180, జడ్పీహెచ్ఎస్లు 249 ఉన్నాయి. జిల్లాలో కొత్త పంచాయతీలు ఏర్పాటు అయినప్పటికీ చాలా చోట్ల పాఠశాలల్లేవు. పంచాయతీకో బడి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించి 11 బడులను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్, చేవెళ్ల మండలంలోని నాంచేరు, మాడ్గుల మండలంలోని జర్పులతండా, పలుగుతండా, జయరాంతండా, మహేశ్వరం మండలంలోని దిలావర్గూడ, నందిగామ మండలంలోని కన్హా, షాబాద్ మండలంలోని నారెడ్లగూడ, గొల్లూరిగూడ, తలకొండపల్లి మండలంలోని గడ్డమీది తండాల్లో కొత్తగా పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
మూతబడిన వాటినీ పునఃప్రారంభించాలి
‘డిపెప్’ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కిలోమీటరుకూ ఒక పాఠశాల ఉండాలనే నిబంధనతో జిల్లాలో గతంలో భారీ స్థాయిలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాలతో విద్యార్థుల సంఖ్య తగ్గి జిల్లాలో 88 పాఠశాలలు మూతబడ్డాయి. మూత బడిన వాటిలో 84 ప్రైమరీ, ఒక హైస్కూల్, మూడు యూపీఎస్‌లున్నాయి. పాఠశాలల మూతతో విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తున్నది. అయితే రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మూత బడిన పాఠశాలలను సైతం పునః ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లో సర్వే నిర్వహించి పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన పంచాయతీలను గుర్తించాం. 11 పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను ఇప్పటికే పంపించాం. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈవో
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

