ప్రభావం చూపని స్వతంత్రులు
చేవెళ్ల లోక్‌సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతోపాటు 21 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.
- చేవెళ్ల లోక్‌సభ బరిలో 21 మంది స్వతంత్రులు
- చాలామంది వెయ్యిలోపు ఓట్లతోనే సరిపెట్టుకున్న అభ్యర్థులు
రంగారెడ్డి, జూన్ 5(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్‌సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతోపాటు 21 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. నామినేషన్లు వేశాక.. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా మిగతా ఎవరూ.. కనీసం ప్రచారం చేయలేదు.
దీంతో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. చాలామంది స్వతంత్ర అభ్యర్థులు వెయ్యిలోపు ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. 41 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో డిపాజిట్‌ను దక్కించుకోలేకపోయారు. నామినేషన్ వేసే సందర్భంలో ధరావతుగా చెల్లించే సొమ్మును కనీస ఓట్లు వచ్చిన అభ్యర్థికే తిరిగి ఇస్తారు. పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు వచ్చినవారికే డిపాజిట్ సొమ్ము దక్కుతుంది.
ఒకే పేర్లతో పోటీ చేసినా..
వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగంగా చేవెళ్ల ఎన్నికల బరిలో ఒకే పేరు ఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేసినప్పటికీ ఆయా అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో మరో అభ్యర్థి ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇతనికి 3,748 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే..కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పేరుతో మరో వ్యక్తి రెవల్యూషనరీ పార్టీ నుంచి పోటీపడ్డారు. ఇతనికి 1,698 ఓట్లు వచ్చాయి. ఈవీఎం ఓటింగ్ సందర్భంగా ఓటర్లు ఎటువంటి గందరగోళానికి గురవ్వలేదు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

