పెద్దేముల్, జనవరి 7 : మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో 14,621 ఆరు గ్యారెంటీల దరఖాస్తులు, 3,321 ఇతర దరఖాస్తులను స్వీకరించగా అందులో బండపల్లి, మారేపల్లితండా, ఖానాపూర్, ఓమ్లానాయక్తండా, కందనెల్లి గ్రామాల దరఖాస్తులను అభయహస్తం వెబ్సైట్లో కంప్యూటరీకరణ చేశారు.
మిగతా 32 గ్రామ పంచాయతీల దరఖాస్తుల నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 2,360 దరఖాస్తులను అభయహస్తం వెబ్సైట్లో నమోదు చేశారు. ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మార్వో కిషన్, ఎంపీడీవో లక్ష్మప్ప, ఏవో నజీరొద్దీన్, ఇన్చార్జి ఎంపీవో రమేశ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
కులకచర్ల, జనవరి 7 : ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు కార్యక్రమం కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభమైంది. మండల ప్రత్యేకాధికారి సరళాదేవి, ఎంపీడీవో నాగవేణి తహసీల్దార్ మురళీధర్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి కులకచర్ల మండలవ్యాప్తంగా 14,193 దరఖాస్తులు రాగా, కొత్త రేషన్ కార్డుల కోసం 3,171 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో నాగవేణి తెలిపారు.