బాలీవుడ్లో కమర్షియల్ పంథాకు భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హీరోయిన్గా వైవిధ్యతను చాటుకుంటోంది తాప్సీ. హిందీ చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి అక్షయ్‌కుమార్ మినహా అగ్రహీరోలతో ఇప్పటివరకు కలిసి నటించలేదు. స్టార్హీరోలతో జోడీకట్టే అవకాశం కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఈ సొగసరి కల త్వరలో తీరనున్నట్లు సమాచారం. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఇమ్మిగ్రేషన్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో షారుఖ్‌ఖాన్‌కు జోడీగా తాప్సీ నటించనున్నట్లు తెలిసింది.