శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 10, 2020 , 02:29:59

మానవత్వంతో నిరుపేదలను ఆదుకోవాలి

మానవత్వంతో నిరుపేదలను ఆదుకోవాలి

అంతర్గాం (రామగుండం) : నిరుపేదలను ఆర్థికంగా ఆదుకుని ప్రతి ఒక్కరూ మానవత్వం చాటాలని 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ కన్నూరి సతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అదే డివిజన్‌ పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన ఇస్లావత్‌ రమేశ్‌ అనే నిరుపేద గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితం కాగా, నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాధితునికి ఆదివారం రూ. 20 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కార్పొరేటర్‌ కన్నూరి సతీశ్‌ హాజరై ఆయన చేతుల మీదుగా నగదు పంపిణీ చేసి మాట్లాడారు. బాధితునికి గత తొమ్మిదేళ్ల క్రితం ట్రాక్టర్‌ ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోవడంతో ఏడాది కాలంగా పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడనీ, బాధితుని భార్య స్వప్న తెచ్చే కూలీ డబ్బులతోనే జీవితం వెల్లదీస్తుందనీ, నెలనెలా మందులు కొనే ఆర్థిక స్థోమత లేదనీ, ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెర్ల రమేశ్‌ ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయడంపై పలువురు అభినందించారు. కార్యక్రమంలో శేఖర్‌ నాయక్‌, కే.మల్లేశ్‌, లక్ష్మణ్‌, టి.శంకర్‌, షాహెదా తదితరులు ఉన్నారు.logo