1 పుల్లశీలుడు = అలసట (పొద్దుపొడిచిన దగ్గర్నుంచి.. పొద్దుగూంకేదాక పత్తి ఏరిన.. పానమంతా పుల్లశీలినట్టయింది)
2 న్యాకు = తెలివి / జ్ఞానం (వానికి మస్తు న్యాకు ఉంటదిరా. ఎవరి దగ్గరైనా బతుకుతడు)
3 మునుం = వరస (మునుంబట్టి మిరికాయ కోత మెదలువెడితే.. మాపటేళ్లకు మునుం వెళ్లింది)
4 గుడ్డెలుగు పాదాలు = ఎలుగుబంటి పాదాలు (అరికాలు మధ్యలో కూడా సందు లేకుండా మొత్తం భూమికి తాకే పాదాలు. వాడివి ‘గుడ్డెలుగు పాదాలు’)
5 5. ఉబ్బాగుతలే = ఏదీ దాచుకోకపోవడం (మొన్న పిల్లను సూసొచ్చిండో లేదో.. యెమ్మట్నే అందరికీ చెబుతుండు.. వీడికస్సలు ఉబ్బాగుతలే)