కష్టానికి వడగండ్ల వానలా
రేపు ఓటమి పాలయ్యేవారే
విపరీత వాగ్దానాలను కురిపిస్తరు
భుజం నిండా బాణాలున్నా
కర్ణునిలా కుంగిపోవడం తెలువక
సముద్రంల నీళ్లన్నీ
పాలమూరు దుక్కమే తెలంగాణ కన్నీళ్లే
పుడితే ఏడుపే, పెళ్లికి ఏడుపే,
సావుకు ఏడుపే,కర్మకాండకు ఏడుపే
నీవు నిలబడ్డకాడనే నీళ్ళుండటం విజయం కాదంటవా?
ఏ పొలం చూసినా
కొట్టేసిన అడవిలాగుండేది
ఏ ఇల్లు చూసినా లాకౌట్లా
తలుపులు మూసే ఉండేవి
పరాయిగడ్డమీద కూలికి పానం పాయే
కూసున్నకాడనే ఇంత కూలి దొరుకుతున్నది
పొలానికి ఆపద్బంధువులా రైతుబంధొస్తున్నది
అవ్వయ్యకు ఆసరా పింఛనొస్తున్నది
ఎరువులకు క్యూ లేదు
బిడ్డ పెండ్లికి బరువు లేదు
ముసలోల్ల తిప్పలు లేవు
ఒంటరి చెల్లె దిగులు లేదు
గీత, బీడీ, చేనేతల కన్నీళ్ళు తుడిచిన
కార్తీక పున్నమి వెలుగులకు పదేండ్లు
కాలం సాగుతుంటది కాలువ ప్రవహిస్తుంటది
రాత్రి పగలులా సంక్షేమం నడుస్తుంటది
రైతు నాగలిని మరువడు
అమ్మ బిడ్డ ఆకలి మరువదు
రుతువులు గతితప్పవు అభివృద్ధి నావ ఆగదు
యాదాద్రి నరసింహుడి అభయం ఆగదు
ఎత్తిన ఉద్యమ జెండా ఎగురుతూనే ఉండాలి
పునర్నిర్మాణంలో కాడిని దించొద్దు
తెలంగాణకు జై కొట్టడానికి నోట్ల పుైండ్లెనోళ్లు
డబ్బాలు మోగిస్తున్నరు మోసాలతో ఊదరగొడ్తున్నరు
మన ఓటు తెలంగాణ కుండాలి
అమరుల త్యాగాలు గెలువాలి ఫలించాలి
నిత్య కల్యాణం పచ్చ తోరణం!! మన తెలంగాణ
వనపట్ల సుబ్బయ్య
94927 65358