కాకతీయుల శిల్పకళా నైపుణ్యాల సాక్ష్యం

వరంగల్ జిల్లాలోని కొండిపర్తి గ్రామం శివాలయం దగ్గర ఒక శిలాస్తంభం మీద నాలుగు పక్కల 192 పంక్తుల్లో ఉన్న సంస్కృత శాసనం దొరికింది. అది మల్యాల వంశీయులకు చెందినది. ఈ శాసనం వేయించినవాడు మల్యాల కాటసేనాని. ఇతడు ఆచమ, సబ్బసేనానుల పుత్రుడు. శాసనంలో మల్యాల వంశీయులు దుర్జయకుల సంభవులుగా పేర్కొనబడ్డారు. శాసనకాలం శ.సం. 1162 = క్రీ.శ 1240, శార్వరి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి.
కొండిపర్తిలో కాటసేనాని రెండు దేవాలయాలను నిర్మించాడు. ఒకటి రుద్రేశ్వరాలయం, రెండవది కేశవ దేవాలయం. ఈ రెండు ఆలయాలను అందులో దేవరలను ప్రతిష్టించి, పూజాదికాలకు, దానమిచ్చే సందర్భంలో ఈ శాసనాన్ని వేయించినాడు. ఈ ఆలయాలను నిర్మించేసరికే కొండపర్తిలో ప్రోలేశ్వరాలయం ఉంది. ఆ దేవునికి కూడా కొంత భూమిని దానంగా సమర్పించబడిన విషయం శాసనం ద్వారా స్పష్టమౌతుంది.
తాను నిర్మించిన రుద్రేశ్వరాలయానికి 30 నివర్తనాల భూమిని, కేశవ దేవర, ప్రోలేశ్వర దేవాలయాలకు రెండు నివర్తనాల భూమిని, అంగరంగ భోగాలకు దానంగా సమర్పించినాడు. ఈ భూములు బెల్లమ చెరువు కింద, వర్షాధారంగా పండే భూములుగా చెప్పబడినవి.
కాట చమూపతి శాసనంలో ‘ప్రతాపాక్రాంత దిక్చక్ర (హరి)దశ్వ ఇవాపరహ॥ సకోట గెల్పాత ఇతి ప్రసిద్ధోనిధి… తమేవ మాహుః పెడముట్టు గండ ముద్దండ యుద్ధాంగణ పండితిమ్నా పరిస్ఫురంతి సమరాంగణేషు…’ అని వర్ణింపబడినాడు. కాట చమూపతి భార్య కాచాంబిక. ఈమె గురించి శాసనంలో..
కాచాంబికా రాజతి తస్య పత్నీ
పతివ్రతా శీల గుణాభిరామా
తత్పాద ముద్రద్వహనాది వోర్వీ
జాతా స్వయం సంప్రతి రత్నగర్భా॥
పతివ్రత, శీల గుణాలు కలిగిన కాచాంబిక పాదముద్రలు తనపై ఉండడం వల్ల భూమి రత్నగర్భగా మారిందట. ఆమె పాద తాడనం భూమికి సహాయపడిందని భావం.
కొండిపర్తిలో కాటసేనాని నిర్మించిన రెండు ఆలయాలతో పాటు ప్రోలేశ్వరాలయం.. ఈ మూడు త్రికూటాలయాలుగా భాసిస్తున్నాయట. కైలాస మేరు మంధర సమానంగా, వాటి శిఖరాలు ఆకాశంలో బంగారు కలశాలుగా కనిపిస్తున్నాయట.
ఆలయ ప్రాకారాలు కూడా నల్ల సరపురాళ్ళను నున్నగా జేసి అంచులు కలిగిన శిలలతో సంధిబంధములు కనిపించకుండా, గోడలను నిర్మించి ఆలయాలను నిర్మించినారు. శిలల మధ్య అతుకులు కనబడకుండా ఒకే పెద్ద శిలను ఆలయంగా, ప్రాకారంగా నిర్మించడం ఆనాటి తక్షకుల గొప్పతనంగా చెప్పుకోవచ్చని శాసనంలో పేర్కొనబడింది. కాకతీయ శిల్ప కళా ప్రావీణ్యం ఆ దేవాలయాల్లో
కనిపిస్తుంది.
- డాక్టర్ భిన్నూరి మనోహరి
9347971177
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

