దేశానికే దిక్సూచిగా కేసీఆర్ పాలన
సుదీర్ఘకాల పోరాటం, అసంఖ్యాక త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి మార్గంలో చరిత్రాత్మక ప్రగతి సాధించింది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన తెలంగాణను వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, పారిశ్రామీకరణ, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడం కేసీఆర్ పాలన ప్రత్యేకత.
సుదీర్ఘకాల పోరాటం, అసంఖ్యాక త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి మార్గంలో చరిత్రాత్మక ప్రగతి సాధించింది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన తెలంగాణను వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, పారిశ్రామీకరణ, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడం కేసీఆర్ పాలన ప్రత్యేకత.
కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ వ్యవసాయాన్ని ‘పండుగ’గా మార్చడం కేసీఆర్ ప్రభుత్వ ఘనవిజయం. పూడికలతో నిండిన చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా పునర్జీవం పోసి, గ్రామీణ జలవనరులను పునరుద్ధరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను విస్తృత ప్రాంతాలకు తరలించి, బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఈ చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యోత్పత్తి కూడా బహుళ రెట్లు అభివృద్ధి చెందింది. రైతుబంధు ద్వారా ఎకరానికి, ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా రూ.5 లక్షల ఆర్థిక భద్రత, 24 గంటల ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు వేదికల నిర్మాణం రైతులకు పూర్తి మద్దతునిచ్చాయి.
ప్రజల వద్దకే సంక్షేమ పాలన
పాలన ప్రజల ముంగిట ఉండాలనే సూత్రంతో పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది. ప్రాజెక్టులు, భౌగోళిక పరిస్థితులు, ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచి 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజన చేశారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం ద్వారా అధికారులు ప్రజలకు దగ్గరయ్యారు. గిరిజన ప్రాంతాల్లోని తండాలు, గూడేలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా ఇవ్వడం ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనం, స్మశానవాటికలు, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు గ్రామీణ జీవన నాణ్యతను మెరుగుపరిచాయి.
విద్యా, వైద్యరంగంలో విప్లవం
పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్యా సంస్థలు విస్తరించాయి. ‘మన ఊరుమన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల ఆధునీకరణతో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. వైద్యారోగ్య రంగంలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. దవాఖానలు, మౌలిక సదుపాయాలు విస్తరించాయి. పడకల సంఖ్య, ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు పెరగడంతో పేదలకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందే విధంగా మారింది. టిమ్స్ నిర్మాణం, నిమ్స్ విస్తరణతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ప్రసిద్ధి చెందింది.
విద్యుత్తు, పారిశ్రామిక పురోగతి
రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రణాళికలు, పట్టుదలతో ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి దాదాపు 20 వేల మెగావాట్లకు పెంచారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు అందించి, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన కరెంటును సరఫరా చేశారు. టీఎస్-ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమల అనుమతులకు పారదర్శక విధానం తీసుకొచ్చారు. నిర్ణీత కాలపరిమితితో అనుమతులు జారీ చేసే పాలసీని అమలు చేశారు. దీంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించి, లక్షలాది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించారు.
సంక్షేమం, ఆర్థిక వృద్ధి
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకార సంక్షేమం వంటి పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు భద్రత కల్పించాయి. ఫలితంగా 2014-15లో రూ.5.06 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2022-23 నాటికి రూ.13.13 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.3,12,398గా నమోదై, జాతీయ సగటు రూ.1,72,276ను అధిగమించింది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనా కాలంలో సాధించిన ఈ బహుముఖ ప్రగతి కేవలం మౌలిక సదుపాయాల విస్తరణే కాదు, ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. కేసీఆర్ దార్శనిక నాయకత్వం తెలంగాణను దేశానికే అభివృద్ధి దిక్సూచిగా నిలబెట్టింది.
(వ్యాసకర్త: మాజీ మంత్రి )
కొప్పుల ఈశ్వర్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

