మీరే బలగం
పాలనాధీశుడిని, ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా దర్శించేది ఉద్యోగులైన మీలోనే. సీఎస్ మొదలు చిట్ట చివరి ఉద్యోగి దాకా సమస్త సిబ్బంది, అధికారులైన మీ గురించి మీకంటే మిన్నగా మీ క్షేమం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తపిస్తారు, ఆలోచిస్తారు. ఆచరణలో చూపిస్తారు. అనుభవంలోకి తీసుకొస్తారు.మరే రాష్ట్రంలోనూ లేనంతగా బేసిక్ పే స్కేల్ అమలు ఇందుకు సత్వర మచ్చుతునక. అంతకుమించి మీ ఆత్మగౌరవ పరిరక్షణను చెక్కు చెదరనీయకుండా కాపాడుతున్నారు.
పాలనాధీశుడిని, ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా దర్శించేది ఉద్యోగులైన మీలోనే. సీఎస్ మొదలు చిట్ట చివరి ఉద్యోగి దాకా సమస్త సిబ్బంది, అధికారులైన మీ గురించి మీకంటే మిన్నగా మీ క్షేమం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తపిస్తారు, ఆలోచిస్తారు. ఆచరణలో చూపిస్తారు. అనుభవంలోకి తీసుకొస్తారు.మరే రాష్ట్రంలోనూ లేనంతగా బేసిక్ పే స్కేల్ అమలు ఇందుకు సత్వర మచ్చుతునక. అంతకుమించి మీ ఆత్మగౌరవ పరిరక్షణను చెక్కు చెదరనీయకుండా కాపాడుతున్నారు.
కొత్తగా కొలువుల్లో చేరిన, 23 ఏండ్ల పైబడి వయసున్న వాళ్లకు, రిటైర్మెంట్ అయినవారికి 2014 దాకా పొత్తుల కుంపటి రాష్ట్రంలో ఎట్లా ఉండేదో తెలియనిది కాదు. మరిచిపోయేది అసలే కాదు. ప్రాంతేతర పాలకులు, వారి ప్రభుత్వాలు అరిగోస పెట్టినవే. దినమో యుగంలా, కత్తిమీద సాములా వివిధ రూపాల్లో పొద్దస్తమానం కుంపటి రాజేసినవే. అవిభాజ్య ఏపీలో రెండు కండ్ల సిద్ధాంతి, టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలంలో, కాంగ్రెస్ హయాంలో మీలో ఎందరో మానసిక వేదనతో నలిగిపోయిన గురుతులు మస్తిష్కంలో కదలాడుతుంటాయి. జన్మభూమి అని, ఆ రివ్యూ, ఈ రివ్యూ అంటూ దివారాత్రాలు వేపుకొని తినేవారు. ఫలితాలతో నిమిత్తం లేకుండా అదే పనిగా సమీక్షా సమావేశాలతో గాబరా గండంలోనే ఉంచేది. పైగా ఆకస్మిక తనిఖీల పేరిట ఆగమాగం చేసేది. అటూ ఇటూ చక్కర్లు కొట్టించేది. హడలెత్తించే బాబు హడావుడి పుణ్యమాని గుండెపోట్లు, మానసిక ఒత్తిడితో మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన దాఖలాలు మీ జ్ఞాపకాలకు దూరం కాని జాడలే.
2014లో మొదటి, 2018లో వరుసగా రెండోసారి టీఆర్ఎస్ (ప్రస్తుత పేరు బీఆర్ఎస్) ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీ పట్లప్రేమ, ఆపేక్ష ఎంతటి హృద్యమైనవో మీ గమనంలో ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ విభాగాల్లో సుమారు 1.30 లక్షల మేర ఉద్యోగాల భర్తీ జరిగింది. దీంతో అవిభజిత రాష్ట్రంలో సగటున ఇద్దరు చేసే పని ఒకరు చేసే తలకు మించిన భారం క్రమంగా తగ్గుతున్నది. ఉద్యోగ ఖాళీలను నింపే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. మరో 80 వేల పోస్టుల్లో నియామకాలకు సర్కారు సంకల్పశుద్ధితో ఉన్నది. అట్టడుగున సేవలందించే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థకు స్వస్తి పలికి దాదాపు 21 వేల మందిని మీ సహచర ప్రభుత్వ ఉద్యోగులుగా వారి జీవితాల్లో సరికొత్త అధ్యాయంగా వెలుగు రేఖలు తాజాగా ప్రసరింపజేశారు సీఎం కేసీఆర్. జీతభత్యాలతోపాటు ఈ విధంగా ఏ ఒక్క కోణంలోనూ విస్మరించకుండా మీతో సహా మీ కుటుంబాలకు బంగరు భవితను పరుస్తున్నారు.
మీ సేవలు, సహకారంతోనే సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మక, పాపులర్ సంక్షేమ పథకాలు, సమగ్రాభివృద్ధి పనులు రాష్ట్రం నలుమూలలా విరాజిల్లుతున్నాయి. పాలకులుగా కేసీఆర్ అత్యున్నత స్థాయిలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఫీల్డులో అమలు చేసేది మీరే. ప్రధానంగా 33 శాఖలు, అవి కలిగి ఉన్న 289 సంస్థల సమస్త యంత్రాంగంగా మీ విధులు బాధ్యతలు పరిపాలనకు ప్రాణప్రదం. గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు పౌరుల సేవలో మీరు తరించడంపైనే సర్కారు ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధిపతి ప్రాథమ్యాలను పౌరుల అనుభవంలో ఉంచే వ్యవస్థల పిల్లర్లు మీరే. ప్రస్తుతానికి దాదాపు 3.50 లక్షల మంది ఉద్యోగులు, ఉద్యోగినులు, అధికారులు, అధికారిణులుగా ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మీరే విస్తారమైన బలం.
మీ జీతభత్యాలు, ఆరోగ్య సేవలు, ఇతర ప్రయోజనాలు నెరవేర్చి సంతోషంగా ఉంచడంలోనే తన సంతృప్తి వెతుక్కునే భోళా శంకరుడికి మీరే పెద్ద బలగం. పాత పింఛన్ స్కీమ్ వర్తిస్తున్న సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులు సహా సీపీఎస్ ఉద్యోగులైన రమారమి 2.20 లక్షల మంది అందరూ సీఎంకు కావాల్సిన ఆత్మీయులే. 30 శాతం ఫిట్మెంట్ గల మొదటి పీఆర్సీ గడువు ముగిసిన నేపథ్యంలో రెండో పే రివిజన్ కమిషన్ ఏర్పాటును ముఖ్యమంత్రి చురుకుగా పరిశీలిస్తున్నారు. స్థితిగతులకనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఐఆర్‌తోపాటు డీఏల విడుదల, పీఆర్సీ వేయడం, సీపీఎస్ కు పరిష్కారం వంటి శుభవార్తలు అందుతాయనే సంకేతాలు మీలో ఉత్సాహం నింపేవే.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 360 డిగ్రీస్‌లో సాఫల్యాలకు, యంత్రాంగంగా మీ కృషి, నిబద్ధతలకు తార్కాణం. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఉపాధి ఉత్పాదక రంగాల సామర్థ్య ఉపాయాల గురించి రచించే సమకాలీన, భవిష్యత్తు ప్రణాళికలతో ప్రగతి రథానికి యంత్రాంగంగా మీరే ఇరుసు. అద్భుతమైన సమూల సుమాల పురోగమనం తెలంగాణ పౌరులుగా మనందరికీ గర్వకారణం.
ఇలాగే మరిన్ని విజయాల కోసం మన ప్రభుత్వాన్ని కాపాడుకుందాం. ఉద్యోగులుగా మీరు, మీ కుటుంబాలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సమష్టిగా సీఎం కేసీఆర్ వెంట ఉండాల్సిన తరుణమిది. గతాన్ని బేరీజు వేసుకొని, వర్తమాన, భవిష్యత్తులను దృష్టిలో నిలుపుకోవాలి. రాజకీయ లాభాపేక్ష, అత్యాశ, స్వార్థ కుట్రపూరిత ప్రతీపశక్తులు పొంచి ఉన్న దరిమిలా అవి సృష్టించే, కృత్రిమ మబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చైతన్యవంతమైన వారిగా, ఆలోచనాశక్తి సంపన్నులుగా తిప్పికొట్టాలి. సర్వకాల సర్వావస్థల్లో మన ప్రభుత్వానికి అండగా ఉండాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

