నాలుగు చినుకులు వాలగానే
మురిసిపోయె పూలతోట
నలుగురు కూడితే
మాటల బెల్లం పంచుకునే సంబురం
జ్ఞాపకాల ముసురు
చుక్కల ముగ్గు పొడుచుకు తిను
వాన పిచ్చుక
గుప్పెడు మనసు
నానుబియ్యం బుక్కిన పెళ్ళికొడుకు
అక్షరాలు పేర్చి
సుందర భవంతులు నిర్మించేవాడు
అక్షర తూటాలు పేల్చి
విషపు కోటలు కూల్చేవాడు
జమ్మిచెట్టు కొమ్మల్లో
ఆయుధాలు దాచినట్టు
అక్షరాలకు తేనె పూసి
పరుల మేలు తలపోసేవాడు
ప్రజల నాల్కలపై నానేందుకు
జనం గుండెల్లో
స్థిర నివాసం అయ్యేందుకు
పగలు రాత్రి అద్భుత వ్యూహాలు రచించేవాడు
పొద్దుపొద్దున్నే
గ్రహాంతర పిట్టలు ఏవో వాలినట్టు
కొమ్మ ఊయల ఊగుతున్న పువ్వులు
చూపు తిప్పుకోలేని
సొగసు చేతబడులు
అందం బాణాలు వొదులుతున్న
నేలమీది ఇంద్రధనుస్సులు
పచ్చందం అగుపడితే
పసురం మేసిపోయినట్టు
పసరు పిందెల మీద
కోతులు మనసు పారేసుకున్నట్టు
చేతులు కత్తెర్లు అయిన
భక్తిపారవశ్యం ముందు
శిరస్సు వొంచిన దాసీ జనాలు
పూల మొక్కలు
కసాయి ఇంటిముందు
తల నిమురుతున్న మేకపిల్లలు
చారెడు నీళ్లు పోసిన పుణ్యానికి
దోసెడు దోసెడు తలలు తెగిన ఉపకారాలు
ఏ దేవుని మెప్పు పొందడానికో
ఈ బుట్టెడు బుట్టెడు నైవేద్యాలు…
గజ్జెల రామకృష్ణ
89774 12795