మహా నగరం హైదరాబాద్ గురించి చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అన్నం పెట్టిన పట్టణాన్ని అవమానిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా?, హైదరాబాద్‌పై అక్కసు ఎప్పుడు వెళ్లగక్కుదామా? అని గోతికాడి నక్కల్లా వేచి చూస్తున్నారు. ఇలాంటివాళ్లు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నామన్న విషయాన్ని గ్రహించకపోవటం సిగ్గుచేటు. హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలు ఇలాంటి వాళ్లకు ఓ అవకాశాన్నిచ్చాయి. దీంతో తమలోని మరుగుజ్జు ఆలోచనలను బయటపెట్టుకోవడం మొదలుపెట్టారు.
కొందరు వ్యక్తులు హైదరాబాద్‌పై విమర్శలు చేయటమే మేధావితనంగా భావిస్తున్నారు. ఎక్కడనుంచైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ చేస్తూ బుద్ధిజీవులుగా తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. అయితే తాము బుద్ధిలేని జీవులమని తెలుసుకోకపోవడం హాస్యాస్పదం. ఇదేనా విశ్వనగరమని? ఇదేనా న్యూయార్క్?, ఏదీ ఇస్తాంబుల్? అనే వినూత్నమైన ప్రశ్నలని సోషల్ మీడియాలో సంధిస్తూ తమ వెర్రితనాన్ని తెలియబర్చుకుంటారు. చిన్న గుంతలో నీళ్లున్న సరే దాన్ని ఫొటో తీసి హైదరాబాద్ మునిగిపోతుందన్నట్టు హాహాకారాలు పెడ్తారు. ఈ వైఖరి ఒక్క సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. హైదరాబాద్‌లో వర్షం పడిందంటే చాలు, కొందరు గొట్టాలు వేసుకొని ఇదిగో ట్రాఫిక్‌జామ్, అదిగో హైజలబాద్ అంటూ కథనాలు వండి వారుస్తుంటారు. ఇది చూసిన ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులు హైదరాబాద్ నిజంగనే జలదిగ్భంధంలో చిక్కుకుందా? అని భయపడుతారు. జనమంతా ఆ నీటిలో మునిగిపోయారా అని జంకుతుంటా రు. నిజంగనే అంత భయకరమైన సమస్య ఉందా అంటే అది శూన్యం. ఒక్క శాతం సమస్యను వెయ్యి రెట్లుగా చూపిస్తూ తమను తాము సంతృప్తిపరుచుకోవటమే వాళ్లు చేస్తున్న పని.
నిజానికి హైదరాబాద్ ఒక మినీ ఇండియా. దేశంలో మరే నగరానికి లేని ఎన్నో ప్రత్యేకతలు హైదరాబాద్ సొంతం. ఇక్కడికి వచ్చి బతికే వాళ్లెవరికైనా సరే ‘ఇది మా ప్రాంతం రా బై’ అన్నట్టు అనిపిస్తుంటది. భాష, ఫుడ్, సంస్కృతి ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా సరే మిగతా ప్రాంతాలవారెవరైనా సరే తాము వేరే అన్నట్టుగా ఫీలవరు. వాతావారణం, కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కూడా హైదరాబాద్‌ది ఓ ప్రత్యేక స్థానం. ఇలాం టి అవకాశం ఉన్నందునే ప్రభుత్వం దీనికి అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి పరిచేలా మౌలిక వసతుల కల్పన చేస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సెకండ్ హెడ్ క్వార్టర్స్‌కు హైదరాబాద్ కేంద్ర స్థానం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా యి కాబట్టే వేలాది కంపెనీలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి.
లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు హైదరాబాద్ ఉపాధి కల్పిస్తున్నది. కానీ విచిత్రంగా హైదరాబాద్‌పై విమర్శలు గుప్పిస్తున్నవారంతా తెలుగువారే కావటం దురదృష్టకరం. కొంతమంది హైదరాబాద్ అభివృద్ధిని ఓర్వలేక ఈ ప్రచారానికి పూనుకుంటే, మరికొంత మంది కేవలం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే ఈ పనిచేస్తున్నారు. నిజానికి హైదరాబాద్‌లో వానలొస్తే వాళ్లు చెప్తున్నంత సమస్య ఉత్పన్నమవుతున్నదా? ఒక్క హైదరాబాద్ మినహా మిగతా ఏ సిటీలోనూ వర్షాలు వస్తే నీళ్లు నిలవటం లేదా? అంటే కచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ సమస్యలు అక్కడున్నాయి.
ఇటీవల నార్త్‌లో భారీ వర్షాలు కురిస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూశాం. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, ఎర్రకోట ప్రాంతం, స్కూళ్లు, దవాఖానలు అన్నీ నీట మునిగాయి. రోడ్లపై రెండు, మూడు రోజులు నీళ్లు నిలిచాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ సహా చాలా రాష్ర్టాల్లోని సిటీలన్నీ నీట మునిగాయి. మరి వాటి సంగతేంటి? ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనైతే అన్ని సిటీలు ఆగమైనయ్. అమెరికా, ప్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఒక్కసారిగా వర్షం కురిస్తే రోడ్లపై నీళ్లు నిలవటం సాధారణ మే. కానీ ఆ విషయాన్నే పట్టించుకోకుండా వర్షం వచ్చిందంటే చాలు పిచ్చి కూతలు కూస్తామంటే ఎట్లా? ఒక్క రోజులో 20 సెంటీమీటర్ల వర్షం వస్తే రోడ్లపై నీళ్లు నిలవవా? ట్రాఫిక్ జామ్ కాదా? వర్షం వచ్చి ఆగిపోగానే ఒక్కసారిగా వాహనదారులంతా రోడ్లపైకి వస్తారు. దాంతో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అంతమాత్రానికే కొంపలు మునిగినట్టు వ్యవహరించడం సబబేనా?.
హైదరాబాద్‌లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నాలాల పునరుద్ధరణ, అదే విధంగా పూడికతీతలు, కొత్త నాలాలు అవసరమైన చోట వాటి ఏర్పాటుజరిగింది. ఎక్కడికక్కడ వాన నీరు నిల్వకాకుండా నాలాలా ద్వారా కాలువలకు, చెరువులకు నీళ్లు చేరేవిధంగా అనుసంధానం చేశారు. అందుకే పరా యి పాలన మాదిరిగా కాలనీలకు కాలనీలు నీళ్ల లో మునిగిపోలేదు. ఈ విషయాలను గతంలో నీట మునిగిన కాలనీవాసులను అడిగితే అర్థమయ్యేలా చెప్తారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య తీర్చటానికి ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల ద్వారా 37 ైప్లె ఓవర్ల నిర్మాణం జరిగింది. ఇక మెట్రో విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలా గతంతో పోల్చుకుంటే ఎంత మెరుగయ్యామన్న విషయాన్ని పక్కన పెట్టి, ఒక్కరోజులోనే సమస్యలన్నీ తీరిపోవాలన్నట్టు సామాజిక మాధ్యమాల్లో స్టేట్మెంట్లు పాస్ చేయడం విడ్డూరం. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంత గొప్పదో అన్న ప్రశ్నను ఒక్కసారి ఇక్కడ బతుకుతున్న ఇతర రాష్ర్టాల ప్రజలను అడిగితే చెప్తారు. తమ రాష్ర్టాలతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉందన్న విషయాన్ని రాష్ర్టేతరులు చాలాసార్లు ఒప్పుకొన్నారు. ఈ విషయాలు తెలిసినప్పటికీ హైదరాబాద్‌పై విష ప్రచారం చేస్తున్నవాళ్లకు కచ్చితంగా చెప్పేదేమంటే ‘మేరా హైదరాబాద్ మహాన్’
-రచ్చ దినేష్
89787 40475