మత్తడిలో చేపల సందడి
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నది.
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నది. ఈ ఉత్సవ ఘడియల నడుమ ఉజ్వల తెలంగాణ ముందు నిలబడి సింహావలోకనం చేసుకుంటున్న సందర్భం ఇది!
మత్స్యకారులను మత్స్యసహకార సంఘాలలోగానీ, మత్స్యసహకార మార్కెటింగ్ సొసైటీలలోగానీ సభ్యులుగా చేర్చుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను తెలంగాణ రాష్ర్ట ఫిషరీస్ ఫెడరేషన్ అమలుపరుస్తున్నది. అంతిమంగా మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి, అభ్యున్నతి కోసం ఈ రాష్ర్ట ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల ఫలితాలన్నీ ప్రతి మత్స్యకారునికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నది.
అనేక ఉపనదులు, వాగులు, పంకలు, దశాబ్దాలకాలం నాటి చెరువులు, కుంటలతో అలరారుతున్నది తెలంగాణ. మండువేసవిలోనూ మత్తళ్లు దుంకుతూ పరవళ్లు తొక్కుతున్న చెరువుల మధ్య, పసిడికాంతులు వెదజల్లుతున్న ధాన్యరాశుల నడుమ రొమ్మువిరుచుకుని నిలుచున్నరు రైతన్నలు. రోకండ్లు పగలకుండానే తెరమరుగవుతు న్న రోహిణీకాలాన్ని వెనక్కి నెడుతూ, మొగులుదిక్కు చూ డాల్సిన దిగులు మోముల దైన్యం నుంచి పుడమితల్లికి వి ముక్తి కలిగింది. వసంతకాల మేఘగర్జనకు స్వాగతతోరణాలను అలంకరించే మృగశిరకార్తెలో తెలంగాణీయులంతా చెరువుగట్టుకు చేరుకుని మిలమిల మెరిసే చేపల నడుమ ‘ఊరూరా చెరువుల పండుగ’ ను నిర్వహించుకునే సందర్భమిది. ఈ చరిత్రాత్మకమైన శుభసందర్భంలో తెలంగాణ మ త్స్యరంగం సాధించిన ప్రగతిని నివేదించుకోవడం మనందరి కర్తవ్యం!
దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘకాలంపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మత్స్యరంగానికి నిజంగానే స్వర్ణయుగంలాంటిది ఈ తొలిదశాబ్ది. మానవజాతి వికాసంలో అత్యంత కీలకమైన నీటివనరుల అభివృద్ధి ఫలితంగా వికాసం పొంది న వ్యవసాయరంగానికి అనుబంధంగా మత్స్యరంగం కూ డా సర్వతోముఖాభివృద్ధి దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నది. వెనుకబాటుతనానికి కారణమైన మౌలిక అంశాలమీద సంపూర్ణమైన అవగాహనతోపాటుగా ఆ సమస్యల పరిష్కారానికి సర్వజనామోదమైన మార్గాలను సూచించడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధహస్తులు. ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికలను అమలుపరచడంలో ఆయనను మించినవారులేరని విశ్వవ్యాపితంగా విశ్వాసాన్ని ప్రకటిస్తున్న నేపథ్యానికి తెలంగాణ రాష్ర్ట మత్స్యరంగం అతీతమైనది కాదు.
వాస్తవానికి గడచిన తొలిదశాబ్దికాలగమనంలో తెలంగా ణ రాష్ర్ట మత్స్యరంగం అనేక అడ్డంకులను అధిగ మించిం ది. మత్స్యరంగాన్ని అభివృద్ధి ప్రస్థానంలోకి మళ్లించడానికి అవసరమైన నీటివనరులను అభివృద్ధి చేసుకున్నది. ఆ నీటివనరుల్లో గరిష్టస్థాయిలో చేపలను పెంచుకునేందుకు అవసరమైన చేపవిత్తనాలను సేకరించింది. వాటిని ప్రతియేటా పూర్తిగా వందకు వందశాతం ఉచితంగా పంపిణీ చేసింది. మత్స్యసహకార సంఘాలలో అర్హులైన సాంప్రదాయ మ త్స్యకార కుటుంబ సభ్యులకు సభ్యత్వాన్ని కల్పించింది. దానికోసం నిబంధనలను సరళీకరించుకున్నది. చేపల ఉత్పత్తితోపాటు ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన వసతులను మెరుగుపరిచింది. ఆధునిక సాంకేతిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. చేపలను విక్రయించుకునేందుకు అడ్డుగా నిలిచిన మధ్య దళారీ వ్యవస్థను రద్దుచేసింది. మత్స్యకారులకు పూర్తిస్థాయి స్వేచ్ఛను కల్పించి, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచింది. మత్స్యకారులకు బీమా సదుపాయానాన్ని కల్పించింది. ఇవన్నీ తెలంగాణ మత్స్యరంగం దేశంలోనే అగ్రగామిగా పురోగమించేందుకు దోహదం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన 2014 సంవత్సరం నాటికి తెలంగాణ ప్రాంతంలో వార్షిక చేపల ఉత్పత్తి కేవలం రెండున్నర లక్షల టన్నులు మాత్రమే. ఈ ఉత్పత్తిస్థాయిని కేవలం ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే నాలుగున్నర లక్షల టన్నులకు పెంచుకోవడం వెనుక ఈ రంగంపట్ల ప్రజాపాలకులకు ఉన్న చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష, అవిరళకృషి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అప్పటివరకు కేవలం సాంప్రదాయ నీటివనరులకే పరిమితమైన తెలంగాణలో ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నం ఫలితంగా అనేక రిజర్వాయర్లు పెరిగాయి. ఫలితంగా తెలంగాణలో చేపల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడ్డాయి. అందువల్లే ఇవాళ తెలంగాణ రాష్ర్టంలోని మత్స్యసహకార సంఘాలలో సభ్యులుగా చేరేందుకు యువతరం పోటీపడుతున్నది. అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా గతంలో అత్యంత కఠినంగా ఉన్న సభ్యత్వ నిబంధనలను సులభతరం చేసింది. చేపల పెంపకానికి అనువుగా ఉన్న నీటివనరుల్లో సభ్యత్వం ఇవ్వడానికి గతంలో రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు) కనీస విస్తీర్ణం కలిగి ఉండాలనే నిబంధనలను సవరించి ఒక ఎకరానికి ఒకరికి సభ్య త్వం ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
మత్స్యసహకార సంఘాలలో సభ్యత్వ నిబంధనలను సవరించడంవల్ల రాష్ర్టం ఏర్పాటుకు ముందు రెండున్నర లక్షలమంది సభ్యులుగా ఉన్న మత్స్యకారుల సంఖ్య ఇవాళ దాదాపు నాలుగున్నరలక్షలకు చేరుకున్నది. గతంలో తెలంగాణ రాష్ర్టంలో గరిష్ఠంగా ఆరున్నర హెక్టార్లుగా ఉన్న నీటివిస్తీర్ణం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తరువాత సుమారు ఏడున్నర లక్షలకు పెరిగింది. ఫలితంగా రాష్ర్టంలో గతంలోని కఠిన నిబంధనలను అనుసరించినా కనీసం ఏడున్నర లక్షల మందికి సభ్యత్వం ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతున్నది. కొత్తసభ్యులను చేర్చుకునేందుకు ఇప్పటికే తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో రెండుదశల్లో ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించింది. తద్వారా సుమారు లక్షన్నరమంది కొత్త సభ్యులను చేర్చుకున్నారు. రాష్ర్టంలో ఇప్పటికే ఐదున్నరవేల సంఖ్యకు చేరుకున్న ప్రాథమిక మత్స్యసహకార సంఘా ల సంఖ్య రానున్నకాలంలో మరో వెయ్యి పెంచుకునే వెసులుబాటును కలిగిఉన్నది.
కొత్తగా సహకార మత్స్యసహకార మార్కెటింగ్ సంఘాలను ఏర్పాటు చేసేందుకు కూడా వీలు కలిగింది. మత్స్యసహకార సంఘాలలోగానీ, మత్స్యసహకార మార్కెటింగ్ సొసైటీలలోగానీ సభ్యులుగా చేర్చుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను తెలంగాణ రాష్ర్ట ఫిషరీస్ ఫెడరేషన్ అమలుపరుస్తున్నది. అంతిమంగా మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి, అభ్యున్నతి కోసం ఈ రాష్ర్ట ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల ఫలితాలన్నీ ప్రతి మత్స్యకారునికి చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మించుకున్న జలాశయాలు, ప్రాజెక్టులకు సంబంధించిన బ్యాక్‌వాటర్, మిషన్ కాకతీయ ఫలితంగా చెరువుల్లో నీటి సౌలభ్యం పెరిగింది. దానివల్ల ఏడాదిపొడువునా మత్స్యకారులందరికీ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇందుకు అనుగుణంగా ఆక్వారంగ అభివృద్ధికి పథకాల ను రూపొందించి అమలు పరుస్తున్నది. రాష్ర్టంలోని మత్స్యసహకార సంఘాలను బలోపేతం చేయడం, మత్స్యకారుల అభ్యున్నతి కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే సుమా రు వెయ్యికోట్ల రూపాయల భారీ వ్యయంతో ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ అమలుపరుస్తున్నది. మత్స్యకారులకు ఆరులక్షల బీమా సదుపాయాన్ని అమలుచేస్తున్నది. ఆధునిక హంగులతో మార్కెట్లను నిర్మించడంతోపాటు మొబైల్ విక్రయ వాహనాలను కూడా అందిస్తున్నది.
సిరిసిల్ల మధ్యమానేరు పరీవాహక ప్రాంతంలో ‘ఆక్వాహబ్’ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నవి. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 8,9,10 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ భవిష్యత్తు మత్స్యరంగం చిత్రపటాన్ని సమూలంగా మార్చనున్నది.
జూన్ 8న రాష్ర్టవ్యాప్తంగా ‘చెరువుల పండుగ’ ను నిర్వహించుకుంటున్నది. ఈ జనజాతరలో మన ఊరు ఊరంతా కలిసి మనఊరి చెరువును పలకరించి, పులకరించిపోదాం … రాండ్రి!
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ర్ట ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్)
పిట్టల రవీందర్
99630 62266
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

