గర్భాశయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

న్యూఢిల్లీ : గర్భాశయం లేకుండా జన్మించిన అమెరికన్ మహిళ అమండ గ్రునెల్ ఈ ఏడాది మార్చిలో ఆరోగ్యంగా ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చారు. గర్భాశయ మార్పిడి ద్వారా తల్లిని కావాలనే అమండ కల నెరవేరింది. అమెరికాలోని ఉథావ్కు చెందిన అమండ(32) 17 ఏండ్ల వయసులో పీరియడ్స్ రాకపోవడంతో చెకప్‌కు వెళ్లిన క్రమంలో తనకు గర్భాశయం లేదనే విషయం తెలిసి షాక్‌కు గురైంది. గర్భాశయ మార్పిడితోనే తనకు పిల్లలు కలుగుతారని వైద్యులు చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. స్నేహితుల సూచనతో గర్భాశయ మార్పిడి కోసం అమండ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ గర్భాశయ మార్పిడి ట్రయల్ ప్రోగ్రాంలో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు.
అదే సమయంలో ఆమె తల్లి ఒవేరియన్ క్యాన్సర్ బారినపడటంతో అమండను కష్టాలు చుట్టుముట్టాయి. తన కూతురికి సంతానం కలిగితే చూసి మురిసిపోవాలని ఆమె తల్లి కోరుకుంది. వారి ఆకాంక్షలు ఫలించడంతో మరణించిన మహిళ గర్భాశయాన్ని అమండకు విజయవంతంగా వైద్యులు అమర్చారు. ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా అమండ ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. గ్రేసీ అనే పేరుతో బిడ్డను అమండ అక్కున చేర్చుకుంది. పుట్టిన సమయంలో బేబీ గ్రేసీ ఆరు పౌండ్ల 11 ఔన్సుల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

