విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?
తమ బ్రాండ్ పేరు, లోగో తప్ప విమానమంతా తెలుపు రంగులోనే ఉంటుంది. మరి ఇలా విమానాలు అన్నింటికీ ఒక తెలుపు రంగు మాత్రమే ఎందుకు వేస్తారో తెలుసా? దాని వెనుక ఒకటి కాదు.. చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
మీరు ఎప్పుడైనా విమానాలను గమనించారా? దాదాపు అన్ని విమానాలు తెలుపు రంగులోనే కనిపిస్తుంటాయి. మనం వాడే బైకులు, కార్లు అన్నీ రకరకాల రంగుల్లో అందుబాటులో ఉంటాయి. కానీ అంత పెద్ద విమానాలు మాత్రం ఒకే రంగులో ఉంటాయి. ఎంత పెద్ద విమానయాన సంస్థకు చెందినది అయినా సరే తమ బ్రాండ్ పేరు, లోగో తప్ప విమానమంతా తెలుపు రంగులోనే ఉంటుంది. మరి ఇలా విమానాలు అన్నింటికీ ఒక తెలుపు రంగు మాత్రమే ఎందుకు వేస్తారో తెలుసా? దాని వెనుక ఒకటి కాదు.. చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

చీప్ అండ్ బెస్ట్
ఎయిర్‌లైన్స్ సంస్థను నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన పని. విమానాలకు తరచూ మరమ్మతులు చేస్తూ ఉండాలి. రంగులు వేస్తుండాలి. ఈ అదనపు భారం తగ్గేందుకు విమానయాన సంస్థలు తెలుపు రంగు వేస్తుంటాయి. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు ఎక్కువ రోజులు వస్తుంది. తొందరగా వెలిసిపోదు. అలాగే ధర కూడా తక్కువగా ఉంటుంది. పెయింట్ వేయడానికి రంగు కూడా తక్కువ పడుతుంది. ఒక్క విమానానికి అటు ఇటుగా 245 లీటర్ల తెలుపు రంగు సరిపోతుంది. పెయింట్ కూడా తొందరగా వేయవచ్చు.

రీసేల్‌లో లాభదాయకం
విమానయాన సంస్థలు చాలావరకు కొత్త విమానాలను కొనుగోలు చేయవు. ఇతర సంస్థల నుంచి లీజుకు తీసుకోవడం లేదా తక్కువ ధరకు కొనుగోలు చేయడం చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో వివిధ రంగుల్లో ఉన్న విమానాలు కొనుగోలు చేస్తే.. తిరిగి పెయింట్ వేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే తెలుపు రంగు విమానాలకే సంస్థలు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. దీనివల్ల రీపెయింట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం వేరే కంపెనీల లోగోలు, ఇతర మార్క్‌లను తొలగిస్తే సరిపోతుంది. ఏవో కొన్ని సంస్థలు మాత్రం ఖర్చు గురించి పట్టించుకోకుండా ఎరుపు, నీలి రంగులు వేస్తుంటాయి.

విమానంలో ఉష్ణోగ్రతల నియంత్రణకు..
తెలుపు రంగుతో పోలిస్తే ఇతర రంగులు సూర్యుడి కాంతి నుంచి వచ్చే ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి విమానాలకు ఇతర రంగులు వేసినప్పుడు మొత్తం ఉష్ణాన్ని లోపలికి శోషిస్తాయి. దీనివల్ల విమానం లోపల వేడి పెరిగిపోతుంది. దీనివల్ల కూలింగ్ వ్యవస్థపై భారం పెరుగుతుంది. తద్వారా ఇంధనం ఖర్చు పెరుగుతుంది. అలాగే సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా పడటం వల్ల విమానంలో ఉండే ప్లాస్టిక్ భాగాలు తొందరగా పాడవుతుంటాయి. అదే తెలుపు రంగు వాడితే మొత్తం ఉష్ణాన్ని శోషించవు. దీనివల్ల విమానంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

ప్రమాదాలు జరగకుండా..
ఆకాశంలో ఉన్నా.. భూమిపై ఉన్నా తెలుపు రంగులో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి టేకాఫ్ లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే విమానం వెలుపలి భాగాల్లో ఏదైనా పగుళ్లు ఏర్పడినా.. మంటలు చెలరేగినా స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చు.

పక్షులు ఢీకొట్టకుండా..
విమానాలు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పక్షులు ఢీకొడతాయని ఎయిర్‌లైన్ సంస్థలు భయపడుతుంటాయి. అయితే విమానాలు తెలుపు రంగులో ఉంటే ఈ సమస్య కాస్త తగ్గుతుంది. తెలుపు రంగులో ఉన్న విమానాలను పక్షులు ఢీకొట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. పక్షులు తెలుపు రంగులో ఉండే విమానాలు చూసి.. వాటిని కూడా పక్షులుగానే భావిస్తాయని.. దీంతో ఆ విమానాలను పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్లిపోతాయని తమ అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రిటన్ రాజకుటుంబంలో మన గౌరమ్మ.. క్వీన్ విక్టోరియా దత్తపుత్రిక గురించి తెలుసా?
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
కూలి పనులు మాని యూట్యూబ్‌లో లక్షలు సంపాదిస్తున్నాడు..
పేదలకు అండగా.. ఒక్కడే 100 ఇండ్లు కట్టించి ఇచ్చాడు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

