న్యూయార్క్ : అదృష్టం తలుపుతట్టినా దురదృష్టం వెంటాడుతుందనేలా ఆ అమెరికన్ వెయిట్రెస్ ఇప్పుడు తలపట్టుకుంది. ఆర్కాన్సాస్‌లో ఓవెన్ అండ్ ట్యాప్ రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పనిచేసే ర్యాన్ బ్రాండ్‌కు కొందరు గెస్ట్‌లు ఏకంగా రూ 3,34,786 టిప్ ఇచ్చారు. భారీ టిప్ అందుకున్న ఆనందం ఎక్కువసేపు నిలవకముందే ఆ టిప్‌ను ఇతర వెయిటర్లతో కలిసి పంచుకోవాలని రెస్టారెంట్ కోరడంతో ఆమె నిరాకరించినందుకు ర్యాన్ తన ఉద్యోగం కోల్పొయింది.
రెస్టారెంట్లో భోజనం చేసిన అనంతరం ఓ టేబుల్‌కు చెందిన 40 మంది గెస్ట్‌లు తలా వంద డాలర్ల చొప్పున ర్యాన్‌కు ఏకంగా రూ 3.34 లక్షల విలువైన 4400 అమెరికన్ డాలర్లను టిప్‌గా ఇచ్చారు. ర్యాన్ పక్కన నిలబడి గ్రాంట్ వైజ్ అనే గెస్ట్ సర్వర్లకు తామందరం ఎలా టిప్‌ను ఇచ్చామనే వివరాలు వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం రెస్టారెంట్ యాజమాన్యానికి చేరడంతో ర్యాన్ ఉద్యోగం కోల్పోయింది.
టిప్‌ను ఇతర సిబ్బందితో పంచుకోవాలని రెస్టారెంట్ కోరగా ఓవెన్ అండ్ ట్యాప్‌లో గత మూడున్నరేండ్లుగా ఇలా ఎన్నడూ టిప్‌ను పంచుకోవడం జరగలేదని ర్యాన్ బదులివ్వడంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె చెప్పుకొచ్చింది. ర్యాన్ బ్రాండ్‌కు ఆసరాగా నిలిచేందుకు గ్రాంట్ వైజ్ ప్రస్తుతం ఆన్లైజ్ ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్ చేపట్టాడు.