Bejing Bans Taiwan Priemier | తైవాన్ ప్రధానితోపాటు ముగ్గురిపై నిషేధం.. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కూ చాన్స్?!
Bejing Bans Thaiwan Priemier | తైవాన్ ప్రధానితోపాటు ఆ దేశానికి చెందిన ముగ్గురు నేతలపై చైనా సర్కార్ నిషేధాజ్ఞలు విధించింది.

Bejing Bans Taiwan Priemier | తైవాన్ ప్రధానితోపాటు ముగ్గురు నేతలపై చైనా కన్నెర్ర చేసింది. తమ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిన తైవాన్ ప్రధాని సు సెంగ్చాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వు, లెజిస్లేటివ్ యువాన్ ప్రెసిడెంట్ యు సికున్లపై డ్రాగన్ నిషేధాజ్ఞలు విధించింది. మెయిన్‌లాండ్ చైనా, హంకాంగ్, మకావుల్లోకి వారు ప్రవేశించకుండా తైవాన్‌లోని చైనా ప్రభుత్వ కార్యాలయం శుక్రవారం ఆంక్షలు జారీ చేసింది. వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. తైవాన్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు లభిస్తున్న తరుణంలో తైపీపై చైనా ప్రతీకార చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
సంస్థలు.. వ్యక్తులకు బీజింగ్ ఇలా ఆదేశాలు..
సదరు ముగ్గురు నేతలతో మెయిన్‌లాండ్ చైనాలోని ఏ సంస్థ గానీ, వ్యక్తిగానీ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడాన్ని బీజింగ్ నిషేధించింది. వారితో కంపెనీలు లాభాలు పంచుకోరాదని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సు సెంచ్చాంగ్, జోసెఫ్ వు, యు సికున్లు తైవాన్ అంతటా చైనాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింపజేస్తున్నారని పేర్కొన్నది. తైవాన్ అధ్యక్షుడు సాయి ఇంగ్ వెన్ పేరెత్తకుండానే వారు తమ వారసత్వాన్ని మరిచిపోయి, మాతృభూమికి ద్రోహం చేయతలపెట్టారని, దేశ విభజన కోరుకుంటున్నారని వివరించింది. ఇది శుభ పరిణామం కాదన్నారు.
2016 నుంచి తైవాన్‌పై బీజింగ్ ఒత్తిళ్లు ఇలా..
2016లో తైవాన్‌లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఆ దేశంపై సైనిక, ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని చైనా కొనసాగిస్తున్నది. తైవాన్ స్వాతంత్య్ర పోరాటానికి సారధ్యం వహిస్తున్న వారి జాబితాలను గ్లోబల్ వాచ్ లిస్ట్‌లో చేర్చింది. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగం అని బీజింగ్ వాదిస్తున్నది. కానీ తైవాన్‌లోని అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ.. ఇప్పటికే తమ దేశం స్వతంత్ర దేశం అని ప్రతి సవాల్ చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి:
Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

