Squid Game : రియల్ లైఫ్‌లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లాల్సిందే?
రియల్ లైఫ్‌లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? | స్క్విడ్ గేమ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
స్క్విడ్ గేమ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా.. ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఇదొక గేమ్. మనుషులతో ఆడే గేమ్. బాగా డబ్బులు అవసరం ఉన్నవాళ్లకు డబ్బుల ఆశ చూపించి.. ఒక ఐలాండ్‌కు తీసుకెళ్లి అక్కడ వాళ్లతో గేమ్స్ ఆడించి.. గేమ్‌లో ఓడిపోయిన వాళ్లను చంపేసి.. చివరకు మిగిలిన ఆ ఒక్క విన్నర్‌కు ప్రైజ్ మనీ అందిస్తారు. అక్కడ వాళ్లు పెట్టే గేమ్స్ కూడా అన్నీ పిల్లలు ఆడే గేమ్స్. ఒక్కసారి ఈ వెబ్ సిరీస్‌ను చూడటం ప్రారంభించాలంటే.. అన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యే వరకు లేవరు. ఏ పని ఉన్నా అన్నీ పక్కన పెట్టేస్తారు. అంత ఆసక్తికరంగా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు కోట్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్నారు.
ఇదొక కొరియన్ డ్రామా. దీన్ని హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి కూడా అనువదించారు. అంటే ఇండియన్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ లేదా ఇంగ్లీష్ భాషకు ఆడియోను సెట్ చేసుకొని ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

అయితే.. ఈ సిరీస్‌ను ఆదర్శంగా తీసుకొని స్క్విడ్ గేమ్ సిరీస్ ఫ్యాన్స్ యూఏఈలోని అబుదబీలో రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే.. సిరీస్‌లో ఉన్నట్టుగా.. అక్కడ గేమ్‌లో ఓడిపోయిన వాళ్లను షూట్ చేసి చంపేయరు. గేమ్స్‌లో కూడా రక్తపాతం ఉండదు కానీ.. కొన్ని గేమ్స్ ఉంటాయి.. వాటిలో గెలిచిన వాళ్లు ముందు రౌండ్స్‌కు క్వాలిఫై అవుతుంటారు. ఓడిపోయిన వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు.
15 మంది ప్లేయర్లతో రెండు టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయిస్తారు. ఇప్పటికే 338 మంది ఈ గేమ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారట. అయితే.. ఈ షోలో గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ కాకుండా.. వేరే బహుమతులు ఇవ్వనున్నారట. అయితే.. ఈ గేమ్ ఈరోజు అంటే అక్టోబర్ 12నే మొదలవనుందని సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?
ప్రేమ కోసం రాజరికాన్ని, రాజభోగాలను వదిలేసిన యువరాజులు, యువరాణులు వీళ్లే..
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

