న్యూయార్క్ : బ్యూటీ ప్రోడక్ట్‌కు మోడల్ అంటే వయ్యారాలు ఒలికించే అందాల భామల కోసం ఆయా బ్రాండ్లు అర్రులుచాస్తుంటాయి. అయితే సొగసరి భామలను పక్కకునెట్టి ఓ బ్యూటీ బ్రాండ్ మోడల్‌గా 99 ఏండ్ల బామ్మ ఎంపికయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన హెలెన్ సిమన్ (99)కు వయసంటే కేవలం అంకె మాత్రమే అని నిరూపించారు. అమెరికన్ బ్యూటీ బ్రాండ్ సే కు ఆమె మోడల్ అయి సంచలనం సృష్టించారు.
ఈ బ్రాండ్‌ను ఆమె మునిమనవరాలు లేనీ క్రోవెల్ నడుపుతుండటం విశేషం. మోడల్స్ కోసం కంపెనీ అన్వేషిస్తుండగా బ్రాండ్‌ను ఆమె బామ్మ సిమన్ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఓ యూజర్ సూచించారు. అయితే బ్యూటీ బ్రాండ్‌కు మోడల్‌గా బామ్మను ఒప్పించేందుకు లేనీ క్రోవెల్ చాలా శ్రమపడాల్సి వచ్చింది.
ఈ వయసులో తాను మోడలింగ్‌కు పనికిరానని బామ్మ సంశయించారు. హెలెన్ సిమన్ ఫోటోలు ఇన్స్టాగ్రాం సహా పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారడంతో బ్యూటీ బ్రాండ్ పేరూ మార్మోగిపోయింది. సిమన్ ఫోటోలకు పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు. గో నాన్నా అంటూ ఓయూజర్ కామెంట్ చేయగా మరో యూజర్ ఆమెను బ్యూటీగా అభివర్ణించాడు.