Tesla car blast | ఖరీదైన టెస్లా కారుని బాంబులు పెట్టి పేల్చిన ఓనర్.. కారణం ఏం చెప్పాడంటే..
Tesla car blast | ఒక టెస్లా కారుని కొన్న ఒక వ్యక్తి దాన్ని బాంబులుపెట్టి మరీ పేల్చేశాడు. అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది.

కారు కొనాలని అందరికీ ఉంటుంది. అందులోనూ అమెరికన్ కారంటే ప్రతి ఒక్కరూ నోరేళ్లబెడతారు. ఇప్పడు మార్కెట్లో ఎల్కెట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఎల్కెట్రిక్ కార్లలో టెస్లా కారు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ కారు ధర రూ.50 లక్షల నుంచి మొదలవుతుంది. అలాంటిది ఒక టెస్లా కారుని కొన్న ఒక వ్యక్తి దాన్ని బాంబులుపెట్టి మరీ పేల్చేశాడు. అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది.
వివరాల్లోకి వెళితే.. ఫిన్లాండ్కు చెందిన త్వామస్ కటైనెన్ అనే వ్యక్తి ఒక టెస్లా కారుని కొన్నాడు. కానీ కొన్నాళ్లు బాగా నడిచిన ఈ హై టెక్నాలజీ కారులో ఆ తరువాత సమస్యలు రావడంతో కటైనెన్ కారుని కంపెనీ సర్వీస్ షోరూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కంపెనీ వారు దాన్ని పరీక్షించి అందులో ఉన్న బ్యాటరీలన్నీ పాడైపోయాయని.. వాటిని రిపేరు చేయడానికి 20 వేల యూరోలు(రూ. 17 లక్షలు) ఖర్చు అవుతుందని అన్నారు. ఇది విన్న కటైనెన్కి ఒక్కసారిగా కోపం వచ్చింది.
ఆ కారుని అతడు కొని ఎక్కువ రోజులు కూడా కాలేదు.. అలాంటిది ఏకంగా రూ. 17 లక్షలు ఖర్చు పెట్టి రిపేరు చేయాలంటే అతనికి మనసురాలేదు. కంపెనీ వారికి బుద్ధి చెప్పడానికి కారుని పేల్చేయాలని కటైనెన్ నిర్ణయించుకున్నాడు. కారుని ఒక అడవిలో తీసుకెళ్లి దానికి ఒకవైపు బాంబులు చుట్టి అందులో టెస్లా కంపెనీ ఓనర్ ఇలాన్ మస్క్ బొమ్మను కూర్చొపెట్టి దానిని రిమోట్ సహాయంతో పేల్చేశాడు. కారు పేల్చే దృశ్యాలన్నింటినీ వీడియోగా రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.
అప్లోడ్ చేసిన కొన్ని గంటలకే ఆ వీడియోకి యూట్యూబ్‌లో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వాస్తవానికి ప్రపంచ మార్కెట్లో టెస్లా కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కారుని ఇలా ఒక వ్యక్తి పేల్చేయడంతో తమ కార్ల గురించి గొప్పలు చెప్పుకునే టెస్లా కంపెనీ ఇరుకున పడింది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- blast
- car
- Electric cars
- finland
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

