మెల్బోర్న్ : ఒంటరి జీవితంతో విసిగిన ఓ వృద్ధుడికి మేమున్నామని భరోసా కల్పించేందుకు ఏకంగా 700 బర్త్‌డే కార్డులతో 101వ ఏట అడుగుపెట్టనున్న జాక్ అన్నాల్ను అపరిచితులు సర్ప్రైజ్ చేశారు. భార్య మరణంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఒంటరిగా ఉంటున్న అన్నోల్ను ఈ ఏడాది కరోనా కారణంగా ఆయన పుట్టినరోజున కుమార్తె కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో తన పుట్టినరోజును అన్నోల్ ఒంటరిగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆయన కేర్ హోం మేనేజర్ గుడ్లిన్ చొరవ తీసుకున్నారు. అన్నాల్ బర్త్‌డేను స్పెషల్ డేగా మలచాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో శతాధిక వృద్ధుడికి బర్త్‌డేకు అభినందనలు తెలుపుతూ 700 మందికి పైగా అపరిచితులు ఆయనకు బర్త్‌డే కార్డులు పంపారు.
వందలాది మంది అభినందనల వెల్లువతో పుట్టిన రోజు నాడు తన కూతురు రాలేని పరిస్థితి ఎదురైనా ఆయన ఆ బాధను అధిగమించగలిగారని గుడ్లిన్ చెప్పుకొచ్చారు. తొలుత తాను తన కొలీగ్స్, స్ధానికులనే అన్నాల్కు బర్త్‌డే కార్డులు పంపాలని కోరారని, అయితే సోషల్ మీడియా ప్రచారంతో ఇది మినీ క్యాంపెయిన్‌గా మారిందని అన్నారు.