Kovid Kapoor | నాపేరు కోవిడ్.. నేను వైరస్‌ను కాదు.. మరెవరిని?
Kovid Kapoor | 2020 నుంచి మాత్రం తన పేరు వల్ల కోవిడ్ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. తన పేరు చెబితే చాలు జనాలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల నుంచి కోవిడ్ తన ప్రతాపాన్ని

Kovid Kapoor | కోవిడ్ కపూర్.. ఇది ఒక వ్యక్తి పేరు. అదేంటి.. కోవిడ్ అనేది వైరస్ పేరు కదా అంటారా. కరోనా వైరస్ రాకముందే.. 30 ఏళ్ల క్రితమే ఆయనకు కోవిడ్ అనే పేరు పెట్టారు అతడి తల్లిదండ్రులు. కానీ.. 2020 నుంచి మాత్రం తన పేరు వల్ల కోవిడ్ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. తన పేరు చెబితే చాలు జనాలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల నుంచి కోవిడ్ తన ప్రతాపాన్ని జనాల మీద చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ పేరు మారుమోగిపోతోంది. దీంతో ఈ కోవిడ్ కపూర్‌కు కోవిడ్ వైరస్‌తో చాలా సమస్యలు వచ్చాయి.

కోవిడ్ కపూర్ది బెంగళూరు. ఆయన ఒక ఎంట్రీప్రెన్యూర్. తన పేరు వల్ల తనకు ఇన్ని కష్టాలు వస్తాయని కోవిడ్ ఏనాడూ అనుకోలేదట. హాయ్.. నా పేరు కోవిడ్ కపూర్.. కానీ నేను వైరస్‌ను కాదు.. అంటూ అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Kovid Kapoor | అతడికి కోవిడ్ అనే పేరు ఎందుకు పెట్టారు?
కోవిడ్ అనే పేరును తన తల్లి పెట్టిందట. కోవిడ్ అనే పేరు హనుమాన్ చాలిసాలో ఉంటుంది. కోవిడ్ అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థం. అందుకే తన తల్లి కోవిడ్ అనే పేరును అతడికి సెలెక్ట్ చేసిందట. తను విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తన పేరును విని జనాలు నవ్వుకున్నారట. తన పేరు వైరస్ కోవిడ్ కాదని.. కోవిడ్ అంటూ ఎంత చెప్పినా జనాలు మాత్రం నవ్వుతూనే ఉన్నారట.

బర్త్‌డే కోసం కేక్ ఆర్డర్ చేస్తే.. హ్యాపీ బర్త్‌డే కోవిడ్ అని రాయమంటే.. కేక్ మీద వైరస్ కోవిడ్ పేరు రాశారట. చివరకు గూగుల్‌లో, జీమెయిల్లో ఎక్కడ తన పేరును కేతో రాసినా.. కేతో కాదు.. సీతో కోవిడ్ పేరు స్టార్ట్ అవుతుంది అంటూ సూచిస్తోందట. కేవలం ఈ పేరు వల్ల ఇలాంటి ఎన్నో సమస్యలను కోవిడ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఏది ఏమైనా.. ఈ పేరు వల్ల తనకు ఎన్నో మధురానుభూతులు కలిగాయని.. ఈ పేరును మాత్రం మార్చుకునే ప్రసక్తి లేదని కోవిడ్ చెప్పుకొచ్చాడు. కాకపోతే.. గత రెండేళ్ల నుంచి ఈ పేరు వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొన్న మాట మాత్రం వాస్తవమే కానీ.. తప్పదు కొన్నేళ్లు భరించాలి అంటూ తన పేరు వల్ల కలిగిన కష్టాలను అందరితో పంచుకున్నాడు కోవిడ్ కపూర్.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

