Tpad Bathukamma | డల్లాస్‌లో టీపాడ్ చిన్నబతుకమ్మ సందడి.. 21న సద్దుల బతుకమ్మ వేడుకలు
Tpad Bathukamma | అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతిని వికసింప చేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డల్లాస్ (టీ-పాడ్).. ఈ నెల 21న సద్దుల బతుకమ్మ సందర్భంగా మెగా వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది.
Tpad Bathukamma | అమెరికా గడ్డపై తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డల్లాస్ (టీ-పాడ్) తెలంగాణ సంస్కృతిని వికసింపజేస్తున్నది. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డల్లాస్‌లోని ఆండ్రివ్ బ్రోన పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందాలుగా పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలి వచ్చిందన్న చందంగా వేడుక సాగింది.
పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు
చిన్నబతుకమ్మ పండుగ సమర్థవంతంగా నిర్వహించేందుకు కమిటీలు వేశారు. ఆ కమిటీలకు ఫౌండేషన కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ మాజీ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల సేవలందించారు.

హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధుర జ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటలు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు, వాటిల్లో నీటి వసతి కల్పన వంటి పనులు చూసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సంతోష్ రేగొండ, సంతోష్, మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె, మాధవి మెంట, దీపికారెడ్డి, శశిరెడ్డి, మాధవి ఓంకార్ తదితరులు ఇతర ఏర్పాట్లు చేశారు.
21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు
అక్టోబర్ 15 నాడు చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసింది టీపాడ్.. ఈ నెల 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డల్లాస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యూ బైక్, బంగారు నాణాలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ బైక్, రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి ప్రకటించారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీ (tpadus.org)ను బ్రౌజ్ చేయొచ్చు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

