Telangana Day | లండన్‌లోని భారత హైకమిషన్‌లో తెలంగాణ డే వేడుకలు
బ్రిటన్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే (Telangana Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‌లోని భారత్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే (Telangana Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్‌లోని భారత్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు, ప్రవాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని ప్రచారం చేయడానికి వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హైకమిషన్ అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడమేకాకుండా అతిథులకు బిర్యానీతో అసలైన తెలంగాణ సంప్రదాయాన్ని చూపించారని తెలిపారు.

లండన్‌లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న తెలంగాణ డే వేడుకల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల అన్నారు. టాక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో భారత హైకమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. నేడు అదే భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసిన భారత హైకమిషన్ కార్యాలయ అధికారులకు, హాజరై సహకరించిన టాక్ సభ్యులకు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేకతను, చేనేత గొప్పదనాన్ని, నేత కార్మికులను ఆదుకోవడానికి తాము చేస్తున్న కృషిని టాక్ సీనియర్ నాయకుడు గణేష్ కుప్పలా వివరించారు. అలాగే చేనేతను ధరించిన టాక్ ప్రతినిధులను వేదికపైకి పిలిచి అతిథులకు పరిచయం చేసి, చేనేత వస్త్రాల వివరాలని తెలిపారు. అంతకుముందు సంస్థ ప్రతినిధులు వేడుకల్లో ఎంతో చుర్రుగ్గా పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు హైదరాబాద్ బిర్యానీ రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో టాక్ ప్రతినిధులు నవీన్ రెడ్డి, హరి నవాపేట్, పవిత్ర, సురేష్ బుడగం, రావుల పృథ్వీ, కార్తీక్, నిఖిల్, కార్తీక్, నవ్య జ్యోతి, దివ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వాతి, సుప్రజ, స్నేహ, కుమారి తన్మయ, విద్య చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

