Singapore Telugu Samajam | కొలువు తీరిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం
Singapore Telugu Samajam | సింగపూర్ తెలుగు సమాజం కొత్త కార్యవర్గ అధ్యక్షుడిగా బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్నికయ్యారు.
Singapore Telugu Samajam | సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం అధ్యక్షుడిగా బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన సారధ్యంలో కార్యవర్గానికి పోటీ చేసిన వారు గెలుపొందారు. గత నెల ఐదో తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీ పడ్డారు. గెలుపొందిన నూతన కార్యవర్గం ఈ నెల ఒకటో తేదీన జరిగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిందని సమాజం గౌరవ కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. ఈ నెల 21న కొత్త కార్యవర్గ సమావేశం జరిగింది.
సమావేశంలో కొత్త అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వెళుతూ వినూత్న కార్యక్రమాలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సమాజాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కొత్త కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మే ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నటలు సమాజం నూతన గౌరవ కార్యదర్శి అనిల్ పొలిశెట్టి ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికైన నూతన కార్యవర్గం ఇదే
అధ్యక్షులు-బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
గౌరవ కార్యదర్శి – పొలిశెట్టి అనిల్ కుమార్
గౌరవ కోశాధికారి – బచ్చు ప్రసాద్.
ఉపాధ్యక్షులు- కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, పాలెపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, టేకూరి నగేష్
నిర్వహణ కార్యదర్శి-కురిచేటి స్వాతి.
సహాయ కోశాధికారి-జూనెబోయిన అర్జునరావు.
ప్రాంతీయ కార్యదర్శులు- బోయిని సమ్మయ్య, కలిదిండి ఫణీంద్ర వర్మ, మేరువ కాశి రెడ్డి, మ్రితివాడ రాంరెడ్డి.
కమిటీ సభ్యులు-బద్దం జితేందర్ రెడ్డి, బాలగా రమణారావు, బండ్ర శేషగిరి, గాడిపల్లి చంద్రమౌళి, గుజ్జుల శ్రీలక్ష్మి, కొత్తా సుప్రియ, రాపేటి జనార్ధనరావు, స్వామి గోపి కిషోర్, వైద మహేష్, ఎఱ్ఱాప్రగడ చాణక్య
గౌరవ ఆడిటర్లు- ఆలపాటి వెంకట రాఘవ రావు, రొడ్డా సతీష్ బాబు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

