NRI | తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
NRI | తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది(Naveen Reddy Mallipeddy) బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది(Naveen Reddy Mallipeddy) బాధ్యతలు స్వీకరించారు. 2025 – 2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోల్ల, సభ్యుడు భరత్ రెడ్డి మాదాది, అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బోర్డ్ సభ్యులుగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్ పెద్దిరెడ్డి, డా. దివాకర్ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్ బొడ్కె, ప్రదీప్ మెట్టు, సురేశ్ రెడ్డి వెంకన్నగరి, నిశాంత్ సిరికొండ, అమిత్ రెడ్డి సురకంటి, గణేశ్ మాధవ్ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్ నిమ్మల, శ్రీకాంత్ రెడ్డి గాలి, అభిలాష్ రెడ్డి ముదిరెడ్డి, మయూర్ బండారు, రంజిత్ క్యాతం, అరుణ్ రెడ్డి అర్కల, రఘునందన్ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్ వాస, ప్రదీప్ బొద్దు, ప్రభాకర్ మదుపాటి, నరేంద్ర దేవరపల్లి, ప్రవీణ్ సామల, ప్రవీణ్ చింట, నరేశ్ బైనగరి, వెంకట్ అన్నపరెడ్డి కొత్తగా నియమితులయ్యారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ రెడ్డికి, బోర్డు సభ్యులకు స్వదేశం, స్వరాష్ట్రం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నవీన్ రెడ్డి ఉద్యోగిగా అమెరికాలో అడుగుపెట్టి, కన్సల్టింగ్ కంపెనీలు, మీడియా, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లతో పాటు అనేక ఇతర సంస్థలను స్థాపించి, ఎన్నో విజయాలు అందుకుంటూ తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తున్నారంటూ ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

