హైదరాబాద్ : గల్ఫ్ కార్మికులకు ఎమ్మెలసీ కవిత ఎప్పుడూ అండగా ఉన్నారని, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవితకు ఎన్నారై టీఆర్ఎస్ బహరేన్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎన్నారై టీఆర్ఎస్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
ఎన్నో గల్ఫ్ కుటుంబంలో వారి జీవితాల్లో కవిత వెలుగులు నింపారు. మాజీ ఎంపీగా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సలహాదారుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత అందిస్తున్న సేవలను సతీష్ కుమార్ కొనియాడారు. బతుకమ్మ, బోనాలను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత కవితది అన్నారు.