లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతి
లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) మరణవార్తను అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పారు.
లండన్‌లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల కిందట లండన్ వెళ్లాడు. అక్కడే పీజీ పూర్తి చేసిన మహేందర్ రెడ్డికి ఉద్యోగం కూడా వచ్చింది. వర్క్ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే పెను విషాదం వారిని ముంచేసింది. అక్టోబర్ 3న గుండెపోటుతో మహేందర్ రెడ్డి మరణించాడు.
ఈ విషయాన్ని అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషించేలోపే ఇలా మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మహేందర్ రెడ్డి తండ్రి రమేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షునిగా ఉన్నారు. మహేందర్ మృతి పట్ల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంతాపం తెలిపారు.
వ తేదీ రాత్రి
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

