దిగ్విజయంగా ముగిసిన ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళావేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ రాజధాని దోహాలో నవంబర్ 22, 23వ తేదీల్లో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. అలాగే మధ్య, ప్రాచ్య దేశాల్లో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళావేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ రాజధాని దోహాలో నవంబర్ 22, 23వ తేదీల్లో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. అలాగే మధ్య, ప్రాచ్య దేశాల్లో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. మధ్య ప్రాచ్య దేశాల నుంచి 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ చారిత్రాత్మక సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖతార్‌లో భారత రాయబారి విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు.
అమెరికా, భారత్, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొని తెలుగు భాష సాహిత్యానందంతో జీవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నది. ఈ దోహా సదస్సులో స్థానిక నిర్వాహక సంస్థ అంధ్ర కళా వేదిక వారి ఆతిథ్యం ‘న భూతో న భవిష్యతి’ అని అందరి మన్ననలూ పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, MSME, SERP & NRI సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలను వీడియో సందేశం రూపంలో తెలియజేశారు.

“మన తెలుగు సారస్వత సంపదను సృష్టిస్తూ, పెంపొందిస్తూ, భాషకీ, సంస్కృతికీ మధ్య వెన్నెముకలా నిలిచే తెలుగు రచయిత ఎవరో చెబితే రచనా వ్యాసంగం చేపట్టిన వారు కాదు అని, రచయితలు స్వయంభువులు, అనగా దైవ స్వరూపులు అనీ, వారిని గౌరవించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం” అని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తన స్వాగత సందేశంలో వినిపించారు. “మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన ఆస్తిత్వం. ఒక దేశ సౌరభాన్ని అక్కడి సాహిత్యం ప్రతిబింబిస్తుంది. అందువలన సృజనాత్మకత, మానవీయ విలువలు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే రచనలు రావాలి” అని ఉత్తేజకరమైన తన ప్రధాన ఉపన్యాసంలో వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దోహాలో ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన సదస్సు నిర్వహించడం తమ సంస్థ అదృష్టమని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల సభాసదులకి స్వాగతం పలికారు.

రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్న రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు.

వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండో రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు.
9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వీడియో లింక్స్:
https://tinyurl.com/VanguriTeluguSadassu
https://tinyurl.com/AKVTeluguSadassu

అన్ని ప్రసంగ వ్యాసాలు, ఇతర వివరాలతో ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక’ త్వరలోనే వెలువడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Telugu Book Of Records




Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

