USA | యూఎస్ఏలో భక్తిభావాన్ని పెంచిన శివ మూర్తుల వైభవం
USA | భారతీయ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో యూఎస్ఏ సిలికాన్ లోయలో ప్రతి ఏట వేసవి ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘శివమూర్తుల వైభవం’ కార్యక్రమం ఆధ్యాంతం భక్తి మార్గంలో రంజింపజేసింది.
హైదరాబాద్ : భారతీయ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో యూఎస్ఏ సిలికాన్ లోయలో ప్రతి ఏట వేసవి ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘శివమూర్తుల వైభవం’ కార్యక్రమం ఆధ్యాంతం భక్తి మార్గంలో రంజింపజేసింది.

అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో శివపదచింతామణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ దర్శించి, కూర్చిన శివపదం సంకీర్తనలు, కళాకారుల నృత్యాలను ప్రదర్శించారు. వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్యం, మోహినీ అట్టం, కథక్, ఒడిసి రీతులతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బిదిషా మొహంతీ (ఒడిసీ) , నైన శాస్త్రి, (భరతనాట్యం) , పెండేకంటి సునీత (కూచిపూడి) , రాజేష్ చావలి (కూచిపూడి), చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యం), భైరవి నెడుంగడి (మోహిని అట్టమ్), గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం), అఖిల రావు (భరతనాట్యం), దీపాన్విత సేన్ గుప్త (కథక్), సీమ చక్రబర్తి , సుప్రియ సుధాకర్, నూతి ప్రసూన (కూచిపూడి ) వారి శిష్యబృందం చేసిన నృత్యాలు భక్తిభావాన్ని పెంచింది.

భారత ప్రభుత్వ కన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళాకారులు అద్భుత నృత్యాలతో బే ఏరియా(Bay Area) శివమయం అయిందని పేర్కొన్నారు. కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని,దెందుకూరి రఘునాథ్ను ఈ సందర్భంగా సన్మానించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి పంపిన అభినందన పత్రాన్ని షణ్ముఖ శర్మకు అందజేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

