కువైట్లో కరోనాతో మృతి చెందిన అల్పాదాయ భారతీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కువైట్ | కొవిడ్ - 19 సమయంలో భారత పౌరులకు అండగా నిలిచేందుకు భారత రాయబార కార్యాలయం ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ (ICSG)ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ : కొవిడ్ – 19 సమయంలో భారత పౌరులకు అండగా నిలిచేందుకు భారత రాయబార కార్యాలయం ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ (ICSG)ను ఏర్పాటు చేసింది. కువైట్లో తక్కువ ఆదాయం కలిగిన భారత పౌరులు కరోనాతో మృతిచెందితే రూ. లక్ష ఆర్థికసాయం అందజేయనున్నట్లు భారత రాయబారి సిబీ జార్జ్ ఇవాళ రాయబార కార్యాలయంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రకటించారు. 120 కువైట్ డాలర్ల కంటే తక్కువ జీతం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘తాజా గణాంకాల ప్రకారం, కువైట్లో 540 మందికి పైగా భారతీయులు కొవిడ్తో మరణించారు. తక్కువ జీతం పొందుతున్న గృహ కార్మికులు 100 మందికిపైగా మరణించారు. రూ. లక్ష ఆర్థిక సాయం కుటుంబానికి పెద్ద మొత్తం కాదని తెలుసు. కానీ కుటుంబ సభ్యులకు కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతున్నా’ అని రాయబారి సీబీ జార్జ్ అన్నారు. మృతుల చట్టపరమైన వారసుడిని ఎంబసీ గుర్తించి ఆ మొత్తాన్ని అప్పగిస్తుందని రాయబారి తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

