బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా ( South Africa ) అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ ( BRS Formation) వేడుకలను జోహానెస్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు నాగరాజు గుర్రాల మాట్లాడుతూ తెలంగాణ సాధన లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమం శక్తివంతమైన రాజకీయ శక్తిగా మారిందని వివరించారు.

తెలంగాణ అభివృద్ధి , సంక్షేమ పథకాల కొనసాగింపుకోసం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసరమని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఫ్రీడమ్ డే, తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఒకే రోజు కావడం గర్వంగా ఉందని అన్నారు. మండేలా , కేసీఆర్ ఇద్దరు యోధులని అన్నారు .ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మేడసాని, సాయి కిరణ్ నల్ల, సుమన్ పోరండ్ల, అరవింద్ చీకోటి, రాజయ్య చీకోటి, మహేందర్ రెడ్డి ఎల్లనొల్ల తదితరులు పాల్గొన్నారు.