NRI | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదం ప్రాచీన సంప్రదాయం, సమగ్ర ఆరోగ్యం దాని ప్రాధాన్యతను వివరించారు.భారత రాయబారి పరమితా త్రిపాఠి ఆరోగ్యం, ప్రకృతితో సమతుల్య జీవనంలో ఆయుర్వేదం ప్రాముఖ్యతను వివరించారు. నిపుణులు వ్యాధుల నివారణ, సమతుల్య జీవన విధానం, సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ప్రదర్శనతో పాటు సాత్విక ఆహార ప్రదర్శన కూడా నిర్వహించారు. భారత దేశపు ప్రాచీన ఆరోగ్య సంప్రదాయాన్ని కువైట్లో పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి ఒక విశిష్ట అనుభూతిని అందించింది.