H-1B Visa | భారతీయ ఐటీ వర్కర్లకు అమెరికా తీపి కబురందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హెచ్1-బీ వీసాల జారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మూడో దఫా లాటరీ తీయనున్నది. ఇలా హెచ్1 బీ వీసాల జారీ కోసం అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం లాటరీ తీయడం అసాధారణం. ఇందుకోసం అడ్వాన్స్డ్ డిగ్రీ కోర్సు ఉండాలన్న పరిమితి ఎత్తేయనున్నది.
ఇందుకోసం అదనపు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఇంతకుముందు సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ఈ నెల 19న యాదృచ్ఛిక ఎంపిక (random selection process) ప్రక్రియ చేపట్టామని పేర్కొంది. తాజాగా కొత్తగా రిజిస్ట్రేషన్లను సోమవారం ప్రారంభిస్తామని వెల్లడించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ఈ గడువు ముగుస్తుంది. సాధారణంగా అమెరికాలో తొలిదశ లాటరీ ద్వారానే 85 వేల మంది ఐటీ నిపుణులకు వీసాలు జారీ అవుతాయి. రెండోదశ లాటరీ ప్రక్రియ జూలైలో నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!