బహ్రెయిన్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కూర్మాచలం స్వీకరించడం పట్ల ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. అనిల్ కుర్మాచలానికి పదవి ఇవ్వడం ప్రతి ప్రవాస బిడ్డకు దక్కిన గౌరవం అన్నారు. అనిల్ తెలంగాణ వాదాన్ని ఖండాంతరాలలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్ నాయకత్వంలో బలంగా వినిపించారన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేశారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు సంగేపు దేవన్న, చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.