UCIL Recruitment 2023 | జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్. అడిషనల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ తదితర పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ రాష్ట్రం జాదుగూడ మైన్స్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో ఉండగా.. ఆగష్టు 18 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 122
పోస్టులు : జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్. అడిషనల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500.
అడ్రస్ : జనరల్ మేనేజర్ (Inst./Pers.&IRs./CP) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, (ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్) P.O. జదుగూడ మైన్స్, జిల్లా- సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832102.
చివరి తేది: ఆగష్టు 18
వెబ్సైట్ : www.ucil.gov.in.