న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 9 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 192 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 192
ఇందులో ఫిట్టర్ 85, మెషినిస్ట్ 31, మెకానిక్ (మోటార్ వెహికిల్) 8, టర్నర్ 5, సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) 23, ఎలక్ట్రీషియన్ 18, ఎలక్ట్రానిక్ మెకానిక్ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి సంబంధిత చిరుమానాకు పంపించాలి.
అడ్రస్: ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9
వెబ్సైట్: https://rwf.indianrailways.gov.in/