NIEPID Secunderabad Jobs | అకౌంట్స్ ఆఫీసర్, ఎల్డీసీ, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, యాక్టివిటీ టీచర్ తదితర పోస్టుల భర్తీకి సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్ (Divyangjan) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 39
పోస్టులు : అకౌంట్స్ ఆఫీసర్, ఎల్డీసీ, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, యాక్టివిటీ టీచర్ తదితరాలు
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 28
నోట్ : ఈ పోస్టులు దేశవాప్త్యంగా ఉన్న ఎన్ఐఈపీఐడీ క్యాంపస్లలో ఉన్నాయి.
వెబ్సైట్ : https:// niepid.nic.in