Mazagon Dock Shipbuilders Recruitment 2023 | ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 26 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 466
పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్
విభాగాలు : ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా
వయస్సు : 14 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.100
చివరితేదీ : జూలై 26
వెబ్సైట్ : www.mazagondock.in