IRDA Assistant Manager Recruitment 2023 | హైదరాబాద్లో 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 45
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.
విభాగాలు: ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.44500
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: మే 10
వెబ్సైట్ : @www.irdai.gov.in