Hyderabad NIMS Recruitment 2023 | న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఎస్సీ (న్యూక్లియర్ మెడిసిన్)తో పాటు పీజీ డిప్లొమా (మెడికల్ రేడియో ఐసోటోప్స్ టెక్నిక్స్) ఉత్తీర్ణులై.. న్యూక్లియర్ మెడిసిన్లో రెగ్యులేటరీ బాడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆఫ్లైన్లో దరఖాస్తు విధానం ఉండగా.. ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 03 పోస్టులు
పోస్టులు : న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్
అర్హతలు : ఎంఎస్సీ (న్యూక్లియర్ మెడిసిన్), లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్, బయోఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్)తో పాటు పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై.. న్యూక్లియర్ మెడిసిన్లో రెగ్యులేటరీ బాడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.75,000.
దరఖాస్తు : ఆఫ్లైన్
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 20
వెబ్సైట్ : https://www.nims.edu.in/