ESIC Hyderabad Recruitment 2023 | రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాలలో.. సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ (Senior Residents) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు : సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ తదితరాలు.
విభాగాలు: రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.67700 నుంచి రూ.2.4లక్షలు వరకు
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ఛాంబర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ESIC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 25 నుంచి 28 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : www.esic.nic.in