BMRCL Recruitment 2023 | స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్(Station Controller/Train Operator), సెక్షన్ ఇంజనీర్, మెయింటెయినర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) ప్రకటన విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 236 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉండనుంది.
మొత్తం పోస్టులు : 236
పోస్టులు: స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్(108), సెక్షన్ ఇంజనీర్(14, మెయింటెయినర్(114) తదితరాలు
అర్హతలు : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: 35 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.94500
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 24
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 22
అడ్రస్ : జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, బీఎంటీసీ కాంప్లెక్స్, కేహెచ్ రోడ్, శాంతినగర్, బెంగళూరు -560027
వెబ్సైట్: https://www.bmrc.co.in