BOB Recruitment 2023 | జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 11 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం పోస్టులు : 87
పోస్టులు : జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేదీ: మే 11
వెబ్సైట్ : www.bankofbaroda.in/careers.