ఉద్యోగం పేరిట మోసం
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట్ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
- రూ. 6లక్షలు తీసుకొని నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నిందితులు
- లింగంపేట్‌కు చెందిన యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డి రూరల్, మే 13: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట్ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్‌కు చెందిన కుమ్మరి ప్రవీణ్‌కుమార్ (28)కు తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఆరిఫ్‌తో పరిచయడం ఏర్పడింది.
ఈ క్రమంలో తనకు ఉద్యోగం కావాలని ఆరీఫ్‌ను కోరగా, డబ్బులిస్తే ఇప్పిస్తానన్నాడు. 2019లో ఉద్యోగం కోసం ఆరీఫ్‌కు రూ. 2లక్షలు ఇవ్వడంతో నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కేరెడ్డిని పరిచయం చేశాడు. రామకృష్ణారెడ్డికి సైతం ప్రవీణ్ విడుతల వారీగా రూ. 6లక్షలు చెల్లించాడు. డబ్బులిచ్చి ఏండ్లు గడుస్తుండడంతో ఉద్యోగం కోసం ఆరిఫ్, రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి చేశాడు. దీంతో వారు సంగారెడ్డిలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ప్రవీణ్‌కు నియామకపత్రాన్ని అందించారు.
వాటిని అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి చూపించగా, అవి నకిలీవని అధికారులు వెల్లడించారు. దీంతో ఇంటికి తిరిగివచ్చిన ప్రవీణ్‌కుమార్.. తనకు ఉద్యోగం అక్కరలేదని, తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆరిఫ్‌ను అడిగినా స్పందించలేదు. ఈ క్రమంలో డబ్బులు వృథా చేశావంటూ కుటుంబ సభ్యులు ప్రవీణ్‌ను తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెంది సోమవారం లింగంపేట్ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉద్యోగం పేరిటి మోసం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

