బీఆర్ఎస్తోనే ప్రగతి సాధ్యం
బీఆర్ఎస్తోనే ప్రగతి సాధ్యమని, కాంగ్రెస్, బీజేపీలతో దుర్గతి పడుతుందని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాయపూర్, బజార్‌కొత్తూర్, డొంకేశ్వర్ గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
- వెలుగుజిలుగుల తెలంగాణకు మళ్లీ చిమ్మచీకట్లు ఎందుకు ?
- బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్‌రెడ్డి
- నందిపేట్, డొంకేశ్వర్‌లో ప్రచారం
నందిపేట్, నవంబర్ 16 : బీఆర్ఎస్తోనే ప్రగతి సాధ్యమని, కాంగ్రెస్, బీజేపీలతో దుర్గతి పడుతుందని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాయపూర్, బజార్‌కొత్తూర్, డొంకేశ్వర్ గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లోని ప్రగతి నివేదికలను ప్రజల ముందుంచి ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్.. తెచ్చింది తాను అవు నా ? కాదా? అని ప్రజలను అడిగారు. ఇప్పుడున్న వెలుగుజిలుగుల తెలంగాణలో మళ్లీ చిమ్మచీకట్లు ఎందుకని ప్రశ్నించారు. గులాబీ సైనికులు తెలంగాణ రక్షకులు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ భక్షకులని కారు గుర్తుకు ఓటు ప్రశాంత జీవితానికి రూటు అన్నారు. నిజామాబాద్, మాక్లూర్‌కు రోడ్లు నిర్మించానని, ఆలూర్, వెల్మల్, నందిపేట్ సహా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించానని తెలిపారు. ఆర్మూర్‌కు 100 పడకల దవాఖాన సాధించి ఆధునిక వైద్యాన్ని గడపగడపకూ చేరువ చేశానని వివరించారు. 5 లక్షల చొప్పున ఇంటింటికీ బీమా కేసీఆర్ ధీమా పథకం అమలు కానున్నదని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే మనకు న్యా యం జరుగుతుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
డొంకేశ్వర్ మండల ప్రజల చిరకాలవాంఛ
డొంకేశ్వర్, ఆలూర్ మండలాలు కావాలన్నది ప్రజల చిరకాలవాంఛ అని.. అది నెరవేర్చానని అన్నారు. కొత్త మండలాలు చేయాలని సీఎం కేసీఆర్‌ను అడిగితే.. అవసరమా అని తన మీద కోపడ్డారని గుర్తు చేశారు. అయినప్పటికీ పట్టు వీడలేదన్నారు. చివరకు ఏం కావాలో చూడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలూర్, డొంకేశ్వర్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా తనకు దైవ సమానులైన కేసీఆర్‌కు డొంకేశ్వర్ ప్రజల తరఫున మరోసారి పాదాభివందనం చేస్తున్నానన్నారు. డొంకేశ్వర్ మండలం కావడంతో ఎంపీడీవో, తహసీల్ కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయన్నారు. డొంకేశ్వర్ మండల అభివృద్ధికి మరింత అవకాశం దొరికిందని జీవన్‌రెడ్డి అన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

